*వెయ్యి రోజులైనా కనీసం హామీలు అమలు చేయని 420 ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం* ..*ఒంటెద్దు నరసింహారెడ్డి.*
*భారీ ఎత్తున నిరసన కార్యక్రమం..*
*సూర్యాపేట జిల్లా..
హుజూర్ నగర్ లో
కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వైఫల్య పాలనపై పట్టణ కేంద్రం లో భారీ నిరసన కార్యక్రమం….
రేవంత్ ఇచ్చిన మోసపూరిత హామీలతో రూపొందించిన 420 మీటర్ల ఫ్లెక్సీ తో వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం…. ముఖ్యఅతిథిగా హాజరైన నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి.. పాల్గొన్న నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు, బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రజాప్రతినిధులు.. ..ఒంటెద్దు నరసింహారెడ్డి హుజుర్ నగర్ లో మాట్లాడుతూ (KTR) పిలుపు మేరకు, మాజీ మంత్రివర్యులు ,సూర్యాపేట శాసనసభ్యులు జగదీష్ రెడ్డి ఆదేశాల మేరకు,
ఈరోజు హుజుర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో అడ్డ రోడ్డు నందు బీఆర్ఎస్ పార్టీ హుజూర్నగర్ ఆధ్వర్యంలో ఆరు గ్యారంటీల వైఫల్యాలపై ధర్నా, బాకీ కార్డుల పంపిణీ, 420 హామీల ఫ్లెక్సీ ప్రదర్శన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆరు గ్యారంటీల వైఫల్యాలపై ధర్నా,, 420 హామీల ఫ్లెక్సీ ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ..
కాంగ్రెస్ 1000 రోజల పాలనా వైపల్యం పై బీఆర్ఎస్ సమరభేరి మోగిస్తోందిఅన్నారు…
కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి..1,000 రోజులవుతున్నా ప్రజలను నట్టేట ముంచిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం 420 మోసాలపై ప్రజల తరఫున బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు పోరాటం చేస్తుందని అన్నారు.. .అబద్ధపు మాటలతో అధికారం చేపట్టి,
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయని ఈ దొంగ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. ఈరోజు నుండి వారం రోజుల పాటు బీఆర్ఎస్ పోరుబాట ఉంటుంది అని,
గ్రామగ్రామాన ‘బాకీ కార్డుల’తో కాంగ్రెస్ నయవంచనను నిలదీద్దాం అని అన్నారు.. బిఆర్ఎస్ పార్టీ పోరాటంతోనే నేడు రైతులకు నీరందుతుందని అన్నారు.. తెలంగాణ రైతుల భూములు ఎండబెట్టుతూ ఆంధ్ర పాలకుల కు గులాం గిరి చేస్తున్నారంటూ ఆరోపించారు.. ఈ కార్యక్రమంలో కొప్పుల సైదిరెడ్డి, కడియం వెంకట్ రెడ్డి,, జక్కులనాగేశ్వరావు, అమర్ గౌడ్, అప్పిరెడ్డి, సురేష్ బాబు, అంజిరెడ్డి,, దొడ్డ నరసింహారావు , నబి, కొండారెడ్డి,,నవీన్,నాగరాజు,పరుశురాం, నగేష్ రాథోడ్,. బచ్చు శ్రీనివాస్ రెడ్డి.. కృష్ణవేణి.. చారి. అంజి.. తదితరులు పాల్గొన్నారు..