మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు..నన్ను, నా పార్టీని టచ్ చేయడం రేవంత్ రెడ్డి వల్ల కాదు…!!

నన్ను ఎవరూ టచ్ చేయలేరు: KCR..

మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

కొత్త సీఎం నన్ను, బీఆర్ఎస్ పార్టీని తిడుతున్నారు.

నన్ను, నా పార్టీని టచ్ చేయడం రేవంత్ రెడ్డి వల్ల కాదు.
రేవంత్ కంటే హేమాహేమీలను ఎదుర్కొన్న చరిత్ర మాది. పదేళ్లు రాష్ట్రాన్ని పదిలంగా కాపాడుకున్నాం….ఇప్పుడు కాంగ్రెస్ వాళ్లు రాష్ట్రాన్ని పరాయివాళ్ల పాలు చేస్తున్నారు…

తెలంగాణ కోసం కేసీఆర్ ఏనాడు వెనక్కిపోడు…ఉడుత బెదిరింపులకు నేను భయపడను…కేసీఆర్ …

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్ కు వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత తొలిసారి తెలంగాణ భవన్ కు కేసీఆర్ చేరుకోవడంతో భారీ సంఖ్యలో బీఆర్ఎస్ తాజా, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతలు తరలివచ్చి ఘన స్వాగతం పలికారు…అసెంబ్లీ ఎన్నికల తరువాత కేసీఆర్ తన నివాసంలో కిందపడటంతో ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు కేసీఆర్ కు పరీక్షలు నిర్వహించి తుంటి సర్జరీ చేశారు. తుంటి సర్జరీ అనంతరం కేసీఆర్ ఇటీవల కోలుకున్నారు. దీంతో ఈనెల 2న అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంలో కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తరువాత పార్లమెంటరీ సమీక్షా సమావేశాల్లో కేసీఆర్ తరచూ పాల్గొంటున్నారు. తాజాగా, అసెంబ్లీ ఎన్నికల తరువాత తొలిసారి తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. కేసీఆర్ తెలంగాణ భవన్ కు వస్తున్నారని తెలుసుకున్న పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో తెలంగాణ భవన్ వద్దకు చేరుకున్నారు. కేసీఆర్ సీఎం.. కేసీఆర్ సీఎం అంటు నినాదాలు చేసిన కార్యకర్తలు..

బీఆర్ఎస్‌కు పోరాటం కొత్తకాదని… తెలంగాణ ప్రయోజనాలే మనకు ముఖ్యమని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మూడు నెలల తర్వాత కేసీఆర్ తెలంగాణ భవన్‌కు వచ్చారు. ఆయనకు మహిళా కార్యకర్తలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన మహబూబ్‌నగర్, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ జిల్లాల ప్రతినిధులతో సమీక్షలో మాట్లాడుతూ… కేఆర్ఎంబీ పరిధిలోకి ప్రాజెక్టులు వెళితే మన రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుందన్నారు. డ్యామ్‌కు సున్నం వేయాలన్నా కేఆర్ఎంబీ అనుమతి తప్పనిసరి అన్నారు.

కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని తీవ్రంగా ఎండగడుతున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రమాదకర మూర్ఖపు వైఖరిని తిప్పికొట్టి కృష్ణా జలాలపై, ప్రాజెక్టులపై తెలంగాణకు రావాల్సిన వాటాను, హక్కులను నూటికి నూరు శాతం కాపాడేందుకు ఎంతదాకనైనా పోరాడాల్సిందేనని పిలుపునిచ్చారు. ఉద్యమం సమయంలో సాగునీరు, తాగునీటి హక్కుల కోసం పోరాడడమే కాకుండా ‘మా నీళ్లు మాకే’ అనే ప్రజానినాదాన్ని… స్వయంపాలన ప్రారంభమైన అనతికాలంలోనే నిజం చేసి చూయించిన ఘనత బీఆర్ఎస్ పార్టీది అన్నారు.

కేఆర్ఎంబీ పేరుతో కృష్ణా నదీ ప్రాజెక్టులపై తెలంగాణకు ఉన్న హక్కులను కైవసం చేసుకునేందుకు కేంద్రం వేసే ఎత్తుగడలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ కేంద్రం ఒత్తిళ్లను తట్టుకుంటూ పదేళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేసి కాపాడిందన్నారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వ అవగాహన రాహిత్యంతో సంతకాలు చేసి తీసుకున్న నిర్ణయంతో భవిష్యత్తులో ప్రాజెక్టుల కట్టలమీదికి కూడా పోలేని పరిస్థితి దాపురించిందని మండిపడ్డారు..