బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లోక్ సభ ఎన్నికలపై సంచలన నిర్ణయం..!!?

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలోని తాజా పరిస్థితులను బట్టి లోక్ సభ ఎన్నికల కోసం సంచలన నిర్ణయం తీసుకున్నారు.

తాజాగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో జరిగిన కీలక సమావేశంలో మాజీ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో పరాజయం పాలైన తర్వాత కెసిఆర్ దేశ రాజకీయాలపైన ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఫోకస్ పెట్టొద్దు అని నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. ఈ క్రమంలోనే లోక్సభ ఎన్నికలకు తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే పరిమితం కావాలని కెసిఆర్ భావిస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం..ఇంట గెలిచి రచ్చ గెలవాలని ఆలోచనలో ఉన్న కేసీఆర్ అందులో భాగంగా 16 ( ఎంఐఎం 1) పార్లమెంటు స్థానాలలో కనీసం 12 నుండి 15 స్థానాలలో విజయం దక్కించుకునేలా ఫోకస్ చేయనున్నట్టు సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలు పుంజుకుంటున్న నేపథ్యంలో పార్లమెంటు ఎన్నికల్లో ఈ రెండు పార్టీలను సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి కెసిఆర్ ప్లాన్ చేస్తున్నారు.

ఈసారి ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించాలని అధికార కాంగ్రెస్ వ్యూహాలను సిద్ధం చేస్తుంది. దీంతో లోక్సభ ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ పార్టీ అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోతే, భవిష్యత్తు ఇబ్బందికరంగా మారుతుందని భావిస్తున్న కెసిఆర్ ఈ క్రమంలోనే లోక్సభ ఎన్నికలకు తెలంగాణ కు మాత్రమే పరిమితం కావాలని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది…