పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి దమ్ముంటే బీఆర్ఎస్‌కు రాజీనామా చేయాలి సవాల్ విసిరిన మంత్రి పువ్వాడ అజయ్‌..

పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి మంత్రి పువ్వాడ అజయ్‌ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్‌లో ఉన్నవారంతా కేసీఆర్ విధేయులేనని..
నా బ్రాండ్- నా గ్రూప్ అంటే కుదరదన్నారు పువ్వాడ అజయ్. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి దమ్ముంటే బీఆర్ఎస్‌కు రాజీనామా చేయాలని సవాల్ విసిరారు…

అంతకుముందు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎర్పాటు చేసినా సమావేశంలో బీఆర్ఎస్ హైకమాండ్ కు మాజీ పార్లమెంటు సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సవాల్ విసిరారు. తనను నమ్ముకున్న నేతలను సస్పెండ్ చేయడం కాదని, దమ్ముంటే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఛాలెంజ్ చేశారు. తనకు బీఆర్ఎస్ సభ్యత్వం ఉందో లేదో అన్నది అధినాయకత్వమే చెప్పాలన్నారు. మొన్నటి వరకూ తన ఫొటోను ఎందుకు వాడుకున్నారని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. గతంలో మీ గెలుపు కోసం తనను ప్రాధేయపడిన విషయాన్ని మర్చిపోయారా అని నిలదీశారు…