పార్టీ మారే ఉద్దేశం లేదు.. బీఆర్ఎస్ పార్టీలోనే రెబల్ అభ్యర్థిగా ఉంటా – ఖానాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖా నాయక్..
పార్టీ మారే ఉద్దేశం లేదు.. బీఆర్ఎస్ పార్టీలోనే రెబల్ అభ్యర్థిగా ఉంటా – ఖానాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖా నాయక్..
మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుందనే నన్ను పక్కన పెట్టారు.. బీఆర్ఎస్ టికెట్ దక్కకపోవడంపై రేఖా నాయక్ తీవ్ర అసంతృప్తి.. అగ్రవర్ణాలకే పదవులు కట్టబెడుతున్నారని విమర్శలు గుపించారు…
బీఆర్ఎస్ (BRS) అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడంపై రేఖా నాయక్ స్పందించారు. పార్టీ ప్రకటించిన ఖానాపూర్ అభ్యర్థి జాన్సన్ నాయక్ అసలు ఎస్టీనే (ST) కాదని ఆరోపించారు. ఖానాపూర్ లో తన సత్తా ఏమిటో చూపిస్తానని పరోక్షంగా పార్టీ అధిష్టానికి సవాల్ విసిరారు. పార్టీలో, ప్రభుత్వంలో అగ్ర వర్ణాలకే పదవులు కట్టబెడుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు కూడా దాదాపు ఖరారు అయింది కండువా కప్పుకోవడమే లేటు అనేటట్లుగా కూడా ప్రచారం జరిగింది… అయితే ఇప్పుడు సడన్గా ఆ నిర్ణయం వెనక్కి తీసుకుంటూ బిఆర్ఎస్ పార్టీ రెబల్ కాండిడేట్ గానే పోటీ చేస్తా అంటూ ప్రస్తుతం రాజకీయంగా చర్చలు జరుగుతున్నాయి….