సికింద్రాబాద్‌ కంట్మోనెంట్‌ BRS ఎమ్మెల్యే సాయన్న మృతి..

సికింద్రాబాద్‌ కంట్మోనెంట్‌ భారత్‌ రాష్ట్ర సమితి శాసనసభ సభ్యుడు సాయన్న (72) ఆదివారం కన్నుమూశారు. గతకొంతకాలంగా ఆయన గుండె, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. షుగర్‌ లెవల్స్‌ పడిపోవడంతో కుటుంబ సభ్యులు సాయన్నను యశోద ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన భార్య, ముగ్గురు కుమారులు, కూతురు ఉన్నారు. 1951 మార్చి 5న సాయన్న చిక్కడపల్లిలో జన్మించారు. ఇప్పటి వరకు ఆయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు…