బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్య‌ర్థులు ఖరారు చేసిన సీఎం కేసీఆర్…

తెలంగాణ శాసనమండలికి త్వరలో జరిగే ఎమ్మెల్యే కోటా ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్య‌ర్థులుగా దేశ‌ప‌తి శ్రీనివాస్, కుర్మ‌య్య‌గారి న‌వీన్ కుమార్, చ‌ల్లా వెంక‌ట్రామిరెడ్డి పేర్ల‌ను సీఎం కేసీఆర్ ఖ‌రారు చేశారు. ఈ నెల 9వ తేదీన నామినేష‌న్లు దాఖలు చేయాలని అభ్య‌ర్థుల‌కు కేసీఆర్ సూచించారు.

చ‌ల్లా వెంకట్రాంరెడ్డి మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి మనవడు (కూతురు కొడుకు) & అలంపూర్‌‌ మాజీ ఎమ్మెల్యే. ఆయన 2004 అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచాడు.