బీఆర్ఎస్ పార్టీ ఏ పార్టీకి బీ పార్టీగా ఉండదు..రాహుల్ గాంధీ ఎవరు రాసిన స్క్రిప్ట్ చదివారు…ఎమ్మెల్సీ తాతా మధుసూదన్..

*ఖమ్మం జిల్లా.*

*బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఖమ్మం జిల్లా పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ ప్రెస్ మీట్ కామెంట్స్..*

కాంగ్రెస్ పార్టీ జన గర్జన సభలో బీఆర్ఎస్ పార్టీపై ఆసత్యాలు మాట్లాడటం జరిగింది.

రాహుల్ గాంధీ దేశం మొత్తం తిరిగాడు కాబట్టి కొంచెం మెచ్యూరిటీ వచ్చింది అనుకున్నాం కానీ ఎవరు రాసిన స్క్రిప్ట్ చదివారు.

మాకు అధికారం ఇస్తే పొడు భూములకు పట్టాలు ఇస్తాం అన్నారు.

దశాబ్దాలుగా పరిష్కారం కానటువంటి పొడు భూములను.. 4లక్షల ఎకరాల్లో ఆదివాసీలకు, గిరిజనులకు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ దే..

అదే రోజు ఇచ్చిన పట్టాలకు రైతు బంధు ఇచ్చాము.

మీకు అవగాహన లేకపోతే ఎలా?

ఉమ్మడి జిల్లాలో పొడు రైతులు సంతోషంగా ఉన్నారు.

ఒక కొమరం బీ లెక్క సీఎం కేసీఆర్ పట్టాలు ఇచ్చారని ఆదివాసీలు సంతోషం వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ పార్టీ ఏ పార్టీకి బీ పార్టీగా ఉండదు.!

మా విదానం అన్ని పార్టీలకు సమదూరం గా ఉన్నాము.

రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాల్లో బీజేపీ కీ బీ టీం గా పనిచేసింది.

మధుయాష్కీ కూడా బీజేపీ గెలుపు కోసం పని చేసారు..?

ఢిల్లీ రాష్ట్ర హక్కుల మీద సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇస్తే ఒక శాంతిభద్రతలు విషయంలో తప్ప అన్నిటిలో ఆ రాష్ట్ర ప్రభుత్వానికి హక్కు ఉంటుందని తీర్పు ఇస్తే…..అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి…. మీరు ఎందుకు స్పందించాలేదు….. మీకు బీజేపీ కీ ఉన్న లోపాయకారి ఒప్పందం ఏమిటీ..?

జోడో యాత్ర లో గుజరాత్ ఎందుకు పోలేదు. ఆప్ పార్టీ బీజేపీ పై పోరాటం చేస్తాం అంటే ఎందుకు మద్దతు ఇవ్వలేదు.

గిరిజనుల మీద ప్రేమ వాలకపోస్తున్న కాంగ్రెస్ ఇంద్రావల్లి కాల్పుల పై ఏమి సమాధానం చెబుతారు.

ముదిగొండ లో 8మంది ఉసురు తీసుకున్నది మీ ప్రభుత్వం కాదా..?

నిన్న ఒకాయన భూకంపం సృష్టిస్తా అని అన్నాడు.

మీరు ఎంత పిలుపు ఇచ్చిన ఇక్కడ భూకంపలు ప్రళయలు రాలేదు..!

తెలంగాణ దేవత సోనియా గాంధీ అంటున్న రేవంత్ రెడ్డి సోనియా గాంధీ భాలీదేవత అని అనలేదు.

బీఆర్ఎస్ అవినీతికి పాల్పడుతుందని అంటున్నారు. రేవంత్ రెడ్డి గతంలో కాంగ్రెస్ అవినీతి పై చేసిన ఆరోపణలు ఏమి చెబుతాడు.

కాళేశ్వరం ప్రాజెక్టు 82వేల కోట్లతో నిర్మిస్తే.. లక్ష కోట్ల రూపాయల అవినీతి ఎక్కడ జరిగింది.. దీని పై చర్యకు సిద్ధమా అంటే రారు.

*కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడము నేర్చుకో..*

నీ తమ్ముడు నీ బీజేపీ లోకీ చేరిచ్చి ఆయన గెలుపు కోసం ఫోన్ చేసిన నువ్వు మా పార్టీ గురించి మాట్లాడే హక్కు లేదు.

కేటీఆర్ ను ఒరే అంటావా మేము తెలుసుకోంటే నువ్వు హైదరాబాద్ లో తిరలేవు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నోరు జాగ్రత్తగా పెట్టుకో..

తెలంగాణ లో అధికారంలోకి వస్తే ఆసరా పెన్షన్ 4వేలు ఇస్తాము అని అంటున్నారు.. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఎందుకు ఇవ్వటం లేదు.

కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు. అధికారంలో ఉన్నపుడు చేయని వారు ఇప్పుడు ఏమి చేస్తారు.

కాంగ్రెస్ పార్టీ అంటే ఎలా ఉంటుందో నిన్న సభ చూస్తే తెలిసిపోతుంది.

నిన్న జాయిన్ అయిన నాయకుడు మాట్లాడిన తీరు.. కాంగ్రెస్ పార్టీ నాయకులకు అర్థం ఐన్నది.

కేసీఆర్ కుటుంబ పాలన అంటున్న రాహుల్ గాంధీ మరి వాళ్ళది ఏమిటి. కుటుంబ పాలనకు సింబల్ కాంగ్రెస్ పార్టీ..

మీరు ఏమి చేశారో వాటి గురించి మాట్లాడడి.. అంతే కాని కేసీఆర్, ఆయన కుటుంబ విమర్శించే హక్కు లేదు.

వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ జిల్లాలో ప్రజలు బ్రహ్మరథ పడతారు.

ముచ్చటగా మూడోసారి సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత డిసెంబర్లో ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తాం..