అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే అధికార పార్టీ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కు వరుస షాక్ లు తగులుతున్నాయి…టిక్కెట్టు దక్కని పలువురు నేతలు పార్టీ వీడుతూనే ఉన్నారు. ఈ జాబితాలో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కీలక నేతలు కూడా చేరారు. అదిలాబాద్ కు చెందిన కీలక నేతలు సైతం కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. బీఆర్ఎస్ బోధ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు కారు దిగబోతున్నారనీ, త్వరలోనే కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
నల్గొండ : *ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి షాక్..* పలు నియోజకవర్గాల్లో భగ్గుమంటున్న అసమ్మతి, పార్టీని వీడనున్న ముఖ్య నేతలు…ఒక్కొక్కరుగా కాంగ్రెస్ గూటికి చేరుతున్న వైనం.
బ్రేకింగ్..
సూర్యాపేట : *కోదాడలో బీఆర్ఎస్ కు షాక్…*
_పార్టీని వీడనున్న మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు, బీఆర్ఎస్ మాజీ ఇంచార్జ్ శశిధర్ రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ ముత్తవరపు పాండురంగారవు.ఈరోజు మధ్యాహ్నం కోదాడలో ఉత్తమ్ తో భేటీ కానున్న నేతలు._
ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ టికెట్ మార్చాలని డిమాండ్ చేస్తున్న నేతలు.
నల్గొండ : *నాగార్జునసాగర్ నియోజకవర్గంలో భగ్గుమంటున్న అసమ్మతి.*
*నల్గొండ :*
_బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పనున్న గుర్రంపోడ్ జెడ్పిటీసీ గాలి రవి కుమార్,10మంది సర్పంచ్ లు, 12మంది మాజీ సర్పంచ్ లు, ఎంపీటీసీ, పలువురు నాయకులు._
*నాగార్జున సాగర్ :*
ఎమ్మెల్యే భగత్ ను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరనున్న నేతలు.
*నల్గొండ :* _నల్గొండ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కు షాక్.పార్టీని వీడనున్న మున్సిపల్ వైస్ చైర్మన్ సహా ఐదుగురు అధికార బీఆర్ఎస్ కౌన్సిలర్లు._
చివరిగా నిన్న ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ప్రచారంలో పాల్గొని ఎంపీ కోమటిరెడ్డికి టచ్ లోకి వెళ్లిన కౌన్సిలర్లు.కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం…
హుజూర్నగర్ నియోజకవర్గంలో మున్సిపల్ చైర్మన్ , కౌన్సిలర్లు,, నేరేడుచర్ల వైస్ చైర్మన్,, పలువురు వార్డ్ నెంబర్లు సర్పంచులు.. పార్టీకి రాజీనామా చేశారు..