తెలంగాణ భవన్ లో మంత్రి హరీష్‌రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన కత్తి కార్తీక…

*BREAKING NEWS*

హైదరాబాద్‌:

*తెలంగాణ భవన్ లో మంత్రి హరీష్‌రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన కత్తి కార్తీక.

కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి హరీష్‌ రావు..

కాంగ్రెస్ పార్టీ నుంచి దుబ్బాక సీట్ ఆశించిన కత్తి కార్తీక…

భారత్ జూడో యాత్రలో రాహుల్ గాంధీ వెంట పాదయాత్ర చేసిన కత్తి కార్తీక….

ప్రముఖ రేడియో జాకీ, టీవీ యాంకర్, బిగ్ బాస్ కంటెస్టెంట్ క‌త్తి కార్తీక.. కాంగ్రెస్‌కి గుడ్ బై చెప్పి.. బీఆర్ఎస్‌లో చేరారు. తెలంగాణ భవన్‌లో మంత్రి హరీష్‌రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకురున్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు.. కాంగ్రెస్‌పై మండిపడ్డారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధికి పైసా ఇవ్వట్లేదన్న ఆయన.. ఆ పరిస్థితి తెలంగాణలో రాకుండా ప్రజలు చూసుకోవాలన్నారు.

ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీలో గ్యారెంటీ లేదన్న హరీశ్ర రావు… కాంగ్రెస్ నేతలు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పాలనలో కర్ణాటక దివాలా తీసిందన్న ఆయన.. కరెంటు కోతలతో రైతు ఆత్మహత్యలు ఎక్కువయ్యాయన్నారు…