బీఆర్ఎస్ పార్టీలోకి మునుగోడు కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి స్రవంతి..!!

ఉమ్మడి నల్లగొండ జిల్లా..

బీఆర్ఎస్ పార్టీలోకి మునుగోడు కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి స్రవంతి

ఈరోజు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోనున్న పాల్వాయి స్రవంతి

అదే బాటలో మరికొంతమంది మునుగోడు కాంగ్రెస్ సీనియర్ నేతలు.

కాంగ్రెస్ పార్టీకి, కోమటిరెడ్డి బ్రదర్స్ కి బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీని వీడేందుకు పాల్వాయి స్రవంతి సిద్ధమయ్యారు. బీఆర్ఎస్ లో పాల్వాయి స్రవంతి చేరనున్నారు. పార్టీలో తనకు ప్రాధాన్యత తగ్గిందని స్రవంతి మనస్తాపం చెందారు. నేడు లేదా రేపు మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆమె బీఆర్ఎస్‌లో చేరనున్నారు. మునుగోడు ఉపఎన్నికల్లో పాల్వాయి స్రవంతి కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగి ఓడిపోయిన విషయం తెలిసిందే. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆయనకు కాంగ్రెస్ హైకమాండ్ మునుగోడు టికెట్ కేటాయించింది.