బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న తుల ఉమ..!!!

బిగ్ బ్రేకింగ్

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న తుల ఉమ

వేములవాడ బీజేపీ నేత తుల ఉమ నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు…

తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బిజెపి పార్టీకి భారీ షాక్ తగిలింది. కరీంనగర్ జడ్పీ మాజీ చైర్మన్ తుల ఉమా..బిజెపి కి బై బై చెప్పి ఈరోజు కారు ఎక్కబోతున్నారు. వేములవాడలో బిజెపి అభ్యర్థిగా ప్రకటించిన తులా ఉమకు టికెట్ ఇచ్చి బీఫామ్ ఇవ్వకపోవడంతో అక్కడ రాజకీయం రసవత్తరంగా మారింది. వేములవాడ బరి నుంచి వికాస్ రావు బిజెపి అభ్యర్థిగా బరిలోకి దిగడంతో తుల ఉమ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

ఈ క్రమంలో BRS శ్రేణులు తుల ఉమాతో రెండు గంటలుగా చర్చలు జరిగాయి. సిరిసిల్ల తెలంగాణభవన్ వేదికగా వినోద్ కుమార్ మంతనాలు జరిపారు. అటు ఉమతో ఈ సందర్బంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడడం జరిగిందట. అంతే కాకుండా ఉమ ఇంటికి వినోద్ కుమార్, బీఆర్ఎస్ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు వెళ్లినట్లు సమాచారం. ఇలా అందరు ఉమా తో మాట్లాడడం తో ఇక చివరికి ఆమె బిఆర్ఎస్ లో చేరేందుకు ఓకే చెప్పారు. ఈరోజు మంత్రి కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరనున్నారని సమాచారం