గులాబీ జెండా ఖతం కాలేదు బిడ్డా.. యాది పెట్టుకోవాలి జాగ్రత్తగా! .. కేసిఆర్..

భూమి ఆకాశం ఉన్నన్ని రోజులు గులాబీ జెండా ఉంటుంది ఇది ఖాయం. అక్కడో ఇక్కడో తలమానిసోనుడు ఒకడో ఇద్దరో పోతే.. కొన్ని బేవార్స్‌ ఛానెల్స్‌ బీఆర్‌ఎస్‌ ఖతమైపోయిందని మాట్లాడున్నయ్‌. ఇంతకు ముందు అట్ల అన్నోడు ఖతమైండు. గులాబీ జెండా ఖతం కాలేదు బిడ్డా.. యాది పెట్టుకోవాలి జాగ్రత్తగా! దొంగ ప్రచారాలకు ఎవడూ భయపడేవాడు లేడు. కొద్ది రోజుల్లోనే ఎంత వైభవంగా బీఆర్‌ఎస్‌ వచ్చి.. మళ్లీ తెలంగాణను ఎలా తీర్చిదిద్దుద్దో మీరే కళ్లారా చూస్తరు’ అన్నారు..
యాది పెట్టుకోవాలి జాగ్రత్తగా! దొంగ ప్రచారాలకు ఎవడూ భయపడేవాడు లేడు. కొద్ది రోజుల్లోనే ఎంత వైభవంగా బీఆర్‌ఎస్‌ వచ్చి.. మళ్లీ తెలంగాణను ఎలా తీర్చిదిద్దుద్దో మీరే కళ్లారా చూస్తరు’ అన్నారు. కరీంనగర్‌ కదనభేరిలో బీఆర్‌ఎస్‌ అధినేత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్‌ గవర్నమెంట్‌లో ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. పోలీసు సోదరులారా మీకు మనవి చేస్తున్నా. మీరు అనవసరంగా గ్రామాల్లో చిచ్చుపెట్టి.. సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని బెదిరిస్తున్నరు. ఇది మంచిది కాదు. మీరు ప్రజల స్పందన చూడండి. నేను అడుగుతున్నా.. మీ పోలీసులకు రాజకీయాలెందుకు? రాజకీయాలు ఏం అక్కరున్నయ్‌ ? ఇవాళ అధికారం ఎవడికి శాశ్వతం’ అన్నారు..
మేం పదేళ్లు ప్రభుత్వంలో ఉన్నం. మామీద కొన్ని కుక్కలు మొరిగినయ్‌. మొరిగినా ఎవడి పాపానవాడే పోతడు అన్నం గానీ మేం ఈ దౌర్జన్యాలు చేయలేదు. మేం ఉన్నడు పోలీసులతో ఈ దౌర్జన్యాలు చేయిస్తే ఈ కాంగ్రెసోడు ఒక్కడైనా రాష్ట్రంలో మిగులునా? మేం ఆ దారిపట్టలేదు. మేం ప్రజల సంక్షేమం కోసం పని చేశాం. 24గంటల కరెంటు కోసం పని చేశాం. పేద ప్రజల ఆకలి తీర్చాలని పని చేశాం. ముసలి, ముతకకు రూ.2వేల పెన్షన్‌ ఇచ్చి ఆదుకున్నాం. ఎంత చెప్పినమో అంత అమలు చేసి చూపించాం. ఒకటో అరో తప్పా అన్ని అమలు చేశాం. 1.70లక్షల మంది విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించాం. జరిగిందేదో జరిగింది. భవిష్యత్‌లో జరగాల్సింది.. నేను మీ అందరికీ కోరేది.. ఈ కరీంనగర్‌లో నిలువెత్తునా తెలంగాణ సోయి నింపుకున్నవాడు మన వినోద్‌ కుమార్‌. క్లీన్‌ క్యారెక్టర్‌ అన్న వ్యక్తి వినోద్‌ కుమార్‌. ఈయనకు బండి సంజయ్‌కి పోలిక లేదు.. పొంతనలేదు. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఈ విషయాలు గమనించి ఎవరుంటే బాగుంటదని నిర్ణయించి దయచేసి వినోద్‌కుమార్‌ను గెలిపించాలి’ కోరారు.

గుండెలనిండా జై తెలంగాణ అంటరా..
‘ఈ రోజు కాంగ్రెసోడు.. బీజేపోడు కానీ గుండెలనిండా జై తెలంగాణ అంటడా..? మళ్లీ ఇదే గులాబీ జెండా అనాలి. 2001 మే 17న ఏలాగైతే సింహగర్జన చేశామో.. అదే విధంగా మతసామర్యంతోని, కులం.. మతం జాతి లేకుండా అందరం కలిసి ముందుకుపోవాలి. అందరం గొప్పగా బతకాలి. ఇవాళే రంజాన్‌ మాసం ప్రారంభమైంది. తెలంగాణవ్యాప్తంగా ఉన్న ముస్లి సోదరులందరికీ కరీంనగర్‌ వేదిక నుంచి రంజాన్‌ శుభాకాంక్షలు తెలుపుతున్న. అందరం కలిసి తెలంగాణ జాతి యావత్‌ ఏకతాటిపై నడిచి కులమతాలకు అతీతంగా అందరం బాగుపడేందుకు గులాబీ జెండా ఉండాలి. ఈ జెండా ఉంటేనే తెలంగాణకు రక్ష. ఈ పార్లమెంట్‌ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో మనం దూసుకుపోవాలి’ అన్నారు.

బేవార్స్‌ ఛానెల్స్‌ ఎప్పుడూ ఉంటయ్‌..
‘కార్యకర్తలు, నాయకులకు నా మనవి. పవర్‌ బ్రోకర్‌ గాళ్లు ఎప్పుడూ ఉంటరు. కొన్ని బేవార్స్‌ ఛానల్స్ ఎప్పుడూ ఉంటయ్‌.. బీఆర్‌ఎస్‌ పుట్టిన నాడే అన్నరు. ఇది మఖలో పుట్టింది.. పుబ్బలో పోతది అని అన్నరు. పుబ్బలో పోలే.. మీ ఈపులే పగిలినయ్‌ బిడ్డా.. ఎక్కడి దాకా తరిమినమో మీకు తెలుసు. తెలంగాణ ఉన్నంతకాలం.. భూమి ఆకాశం ఉన్నన్ని రోజులు ఈ గులాబీ జెండా ఉంటది. ఇది ఖాయం. అక్కడో ఇక్కడో తలమానిసోనుడు ఒకడో ఇద్దరో పోతే.. కొన్ని బేవార్స్‌ ఛానెల్స్‌ బీఆర్‌ఎస్‌ ఖతమైపోయిందని మాట్లాడున్నయ్‌. ఇంతకు ముందు అట్ల అన్నోడు ఖతమైండు గానీ.. గులాబీ జెండా ఖతం కాలేదు బిడ్డా.. యాది పట్టుకోవాలి జాగ్రత్తగా! దొంగ ప్రచారాలకు ఎవడూ భయపడేవాడు లేడు. కొద్ది రోజుల్లోనే ఎంత వైభవంగా బీఆర్‌ఎస్‌ వచ్చి.. మళ్లీ తెలంగాణను ఎలా తీర్చిదిద్దుద్దో మీరే కళ్లారా చూస్తరు. మీరే సలామ్‌లు కొట్టుకుంటూ వస్తరు. కాబట్టి మీ బేవార్స్‌ బ్రోకర్‌ ప్రచారాలు బంద్‌ చేయాలి. ఎవడో నలుగురుపోతే మనకు పోయేది ఏం లేదు. కార్యకర్తలు ప్రజాశక్తిని కూడదీసి ముందుకుపోయి అద్భుతంగా విజయాన్ని సాధిద్దాం.. మన రాష్ట్రాన్ని గొప్పగా తీర్చిదిద్దుకుందాం. ఈ పార్లమెంట్‌ ఎన్నికల్లో కరీంనగర్‌ నుంచి వినోద్‌కుమార్‌ను గెలిపించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నా.. జై తెలంగాణ’ అన్నారు.