బీఆర్ఎస్ కు జిహెచ్ఎంసి మాజీ డిప్యూటీ మేయర్‌ రాజీనామా…

బీఆర్ఎస్ కు జీహెచ్‌ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్‌, బోరబండ కార్పొరేటర్‌ ఫసియుద్దీన్‌ రాజీనామా చేశారు. కొంతకాలంగా ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌తో ఫసియుద్దీన్‌కు విభేదాలు ఉన్నాయి. ఈ విషయాన్ని కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ఫలితం లేకపోయిందని ఫసియుద్దీన్‌ భావించినట్లు తెలుస్తోంది. ఇటీవల జూబ్లీహిల్స్‌లో కేటీఆర్‌ సమావేశానికి ఫసియుద్దీన్‌కు ఆహ్వానం రాలేదు.*SSK*