ముఖ్యనేతలు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా,, బిజెపిలో చేరికలు…

*BRS జాగృతి కమిటీల రద్దు..*

*బిజెపిలో చేరిన బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు.*

https://youtube.com/shorts/GyGCa960xC4?si=CJNgWIHQYq07OpnN

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఆ పార్టీ నుంచి ఇతర పార్టీలకు నేతల వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా, బీఆర్ఎస్ పార్టీ మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలు బీఆర్ఎస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరారు..మహబూబాబాద్‌, ఆదిలాబాద్‌ మాజీ ఎంపీలు సీతారాం నాయక్‌, గోడం నగేశ్‌, హుజూర్‌నగర్‌ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు కాషాయ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో వీరు నలుగురు బీజేపీలో చేరారు..