అక్టోబర్ 15న హుస్నాబాద్ బహిరంగ సభలో బీఆర్ఎస్ పార్టీ మానిఫెస్టో ప్రకటించనున్న కేసీఆర్…

అందరికీ బి ఫామ్స్.. ఒకటి రెండు మార్పులు చేర్పుల తప్ప మిగతాదంతా ప్రకటించిన ప్రకారమే..

అక్టోబర్ 15న హుస్నాబాద్ బహిరంగ సభలో బీఆర్ఎస్ పార్టీ మానిఫెస్టో ప్రకటించనున్న కేసీఆర్…

అక్టోబర్ 15వ తేదీన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో, తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం
.. అదేరోజు అభ్యర్థులకు బీ ఫారాలను అందించి పార్టీ మేనిఫెస్టో విడుదల

నవంబర్ 9న రెండు చోట్ల నామినేషన్ వేయనున్న కేసీఆర్

అక్టోబర్ 15, 16, 17, 18 తేదీల్లో జిల్లాలు, నియోజకవర్గాల పర్యటన.

అక్టోబర్ 15న హైద్రాబాద్ నుంచి బయలుదేరి., హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్ పాల్గొంటారు.

తెల్లారి…అక్టోబర్ 16 నాడు జనగామ, భువనగిరి నియోజకవర్గాల కేంద్రాల్లో బహిరంగ సభలో సిఎం పాల్గొంటారు.

17న సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించే బహిరంగ సభలో సిఎం కేసీఆర్ పాల్గొంటారు.

అక్టోబర్ 18 నాడు.. మధ్యాహ్నం 2 గంటలకు జడ్చర్ల నియోజకవర్గ కేంద్రం లో., అదే రోజు సాయంత్రం 4 గంటలకు మేడ్చల్ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించే బహిరంగ సభల్లో సిఎం పాల్గొంటారు…

టిఆర్ఎస్ పార్టీ సీఎం కేసీఆర్ ప్రకటించిన ఎమ్మెల్యేల లిస్ట్ ప్రకారం అందరికీ బి ఫామ్ ఇస్తున్నట్లుగా ఆ పార్టీ నేతల సమాచారం…
నిన్న మొన్నటి వరకు కొంతమంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉండడంతో వారికి సీఎం కేసీఆర్ బీఫామ్ ఇచ్చే అవకాశం లేదనే ప్రచారం జోరుగా సాగింది కానీ సీఎం కేసీఆర్ ప్రకటించినట్లుగానే అందరికీ బీఫాములు ఇస్తున్నట్లుగా స్పష్టమైన సమాచారం బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కి అందినట్లు సమాచారం..