రెండు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్‌..

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మరో రెండు లోక్‌సభ స్థానాలకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఖరారు చేశారు. వరంగల్‌ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్‌ కడియం కావ్యను, చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌ పేర్లను ప్రకటించారు. బీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులతో చర్చించి వారి అభిప్రాయాలకు అనుగుణంగా కేసీఆర్‌ అభ్యర్థులను ఎంపిక చేశారు…

చేవెళ్ల మరియు వరంగల్ పార్లమెంటు స్థానాల్లో పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులను బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు.

*చేవెళ్ల పార్లమెంటు స్థానానికి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్…ను ప్రకటించారు.*

అదే విధంగా…

నేటి వరంగల్ ముఖ్యనేతలతో జరిపిన చర్చల అనంతరం సమష్టి నిర్ణయాన్ని అనుసరించి *వరంగల్ పార్లమెంటు నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్య.. ను అధినేత కేసీఆర్ ప్రకటించారు.

తొలి జాబితాలో బీఆర్‌ఎస్‌ పార్టీ నలుగురు అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి సిట్టింగ్‌ ఎంపీ, బీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్‌రావు, మహబూబాబాద్‌ (ఎస్టీ రిజర్వ్‌) స్థానం నుంచి సిట్టింగ్‌ ఎంపీ మాలోత్‌ కవిత, కరీంనగర్‌ నుంచి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌, పెద్దపల్లి (ఎస్సీ రిజర్వ్‌) స్థానం నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను ఇప్పటికే ఖరారుచేశారు..