బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థులను మొదటి లిస్ట్ ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కేసిఆర్..!

గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ ఇవాళ తెలంగాణ భవన్‌కు రానున్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో అందుకు ఆయన కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ బీఆర్ఎస్‌ తరపున పోటీ చేయబోయే కొంతమంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసారు..

పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల తొలి జాబితాను బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రకటించారు. సోమవారం తెలంగాణ భవన్ వేదికగా పలు సెగ్మెంట్ల నేతలతో భేటీ అయిన కేసీఆర్..ఎన్నికల్లో అనుసరించే వ్యూహాలను దిశానిర్ధేశం చేశారు. అనంతరం నాలుగు లోక్‌సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఆయా సెగ్మెంట్ల నేతలతో సుదీర్ఘంగా చర్చించి పేర్లు ప్రకటించారు.

పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయబోయే బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు

1.కరీంనగర్ – బి. వినోద్ కుమార్
2.పెద్దపల్లి – కొప్పుల ఈశ్వర్
3.ఖమ్మం – నామా నాగేశ్వర్ రావు
4.మహబూబాబాద్ – మాలోత్ కవిత

గత రెండు రోజులుగా ఆయా పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నేతలతో చర్చించిన అనంతరం సమష్టి నిర్ణయం ప్రకారం నలుగురు అభ్యర్థులను అధినేత ప్రకటించారు.ఈ సందర్భంగా అభ్యర్థులకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.