బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రివర్యులు కేటీఆర్, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు జగదీశ్ రెడ్డి..

*బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రివర్యులు కేటీఆర్, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు జగదీశ్ రెడ్డి తో కలిసి రేపు (గురువారం) హుజూర్ నగర్, మునుగోడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు..

*పర్యటన వివరాలు:.

-ఉదయం 10 గంటలకు హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియం నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి.. ఉదయం 10:50 గంటలకు హుజూర్ నగర్ పట్టణానికి చేరుకుంటారు.
-ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు హుజూర్ నగర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద స్థానిక ఎమ్మెల్యే సైదిరెడ్డి తో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు.
-మధ్యాహ్నం 12:30 గంటలకు గ్రీన్ వుడ్ స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొంటారు.
– మధ్యాహ్నం 1:45 గంటలకు హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి నివాసంలో లంచ్ చేస్తారు.
-మధ్యాహ్నం 2:30 గంటలకు హుజూర్ నగర్ పట్టణం నుంచి హెలికాఫ్టర్ ద్వారా బయలుదేరి.. మధ్యాహ్నం ౩ గంటలకు మునుగోడు నియోజకవర్గం, చండూర్ టౌన్ కు చేరుకుంటారు.
-మధ్యాహ్నం ౩:30 గంటలకు గట్టుప్పల్ మండల కేంద్రంలో క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ను ప్రారంభిస్తారు.
-సాయంత్రం 4:30 గంటలకు చండూరు పట్టణానికి చేరుకుంటారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.
–సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ తిరిగి ప్రయాణం అవుతారు.