బీఆర్ఎస్ పార్టీలో నర్సాపూర్ టికెట్ లొల్లి..

బీఆర్ఎస్ పార్టీలో నర్సాపూర్ టికెట్ లొల్లి..

టికెట్ నాకే ఇవ్వాలి.. కావాలంటే సునీత లక్ష్మారెడ్డిని ఎమ్మెల్సీగా చేసి మంత్రి పదవి ఇవ్వండి కానీ ఎమ్మెల్యే టికెట్ మాత్రం నాకే ఇవ్వాలి అంటున్న ఎమ్మెల్యే మదన్ రెడ్డి..

నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌ షాక్‌ ఇవ్వనున్నారని సమాచారం. బీఆర్‌ఎస్‌ ఇవాళ అసెంబ్లీ టికెట్లు ప్రకటించనుంది. ఈ సారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది బీఆర్ఎస్ పార్టీ. ఈ క్రమంలోనే ఆ దిశగా చర్యలు వేగవంతం చేసింది. ఇలాంటి సందర్భంలోనే మెదక్ జిల్లా నర్సాపూర్ లో ఎమ్మెల్యే మదన్ రెడ్డిని కలిసారు BRS కార్యకర్తలు…నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి అధిష్టానం టిక్కెట్ ఇవ్వకపోతే పార్టీకి రాజీనామా చేస్తామని నర్సాపూర్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఆందోళనకు దిగారు. మదన్ రెడ్డికి తప్ప ఇంకెవరికైనా BRS నుంచి టికెట్ వస్తే సహకరించబోమంటున్నారు కార్యకర్తలు. అయితే.. ఈ సందర్భంగా కార్యకర్తలు ఎవరు ఆందోళన చెందొద్దని, శాంతంగా ఉండాలని కోరారు నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి. మరి ఈ వివాదంపై సీఎం కేసీఆర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి..