బీఆర్‌ఎస్‌కు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం రాజీనామా…

అధికార పార్టీ భారత్ రాష్ట్ర సమితి (BRS)లో అసంతృప్తి రగులుతోంది. సీఎం కేసీఆర్ తొలి విడత జాబితాలో తమకు టికెట్ నిరాకరించడంతో ఒక్కొక్కరుగా నేతలు బీఆర్ఎస్ ను వీడుతున్నారు.

ఇప్పటికే ఖానాపూర్ రేఖా నాయక్ దంపతులు కాంగ్రెస్ లో టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.

తాజాగా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం(Vemula Veeresham): బీఆర్ఎస్ వీడుతున్నట్లు ప్రకటించారు. తనను, తన అనుచరులను కేసులు పెట్టి వేధించారంటూ సంచలన ఆరోపణలు చేశారు…
అందుకే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినట్లు చెప్పారు. అంతకుముందు తన అనుచరులతో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వీరేశం భేటీ అయ్యారు. అనంతరం తన నిర్ణయాన్ని ప్రకటించారు…