బీఆర్ఎస్‌కు జడ్పీ ఛైర్‌పర్సన్ సరిత రాజీనామా..

జోగులాంబ గద్వాల జిల్లాలో అధికారం బీఆర్ఎస్ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య పార్టీకి రాజీనామా చేశారు… ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలతో సమావేశం కానున్నట్లు పలువురు నాయకులు చెప్తున్నా సమచారం… జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా సరిత తిరుపతయ్య బాధ్యతలు తీసుకున్న కొంతకాలం నుంచి గద్వాల, అలంపూర్ ఎమ్మెల్యేలతో పలు అంశాలలో విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో పలు సందర్భాలలో పరస్పరం విమర్శలు కూడా చేసుకున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో అధికార బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో విభేదాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. దీంతో ఆమె నెల రోజుల క్రితం నుంచి పార్టీ మారుతున్నారు అని ప్రచారం జరిగింది. కానీ పలు సందర్భాలలో ఆమె ఖండిస్తూ వచ్చారు.. ప్రస్తుతం ఆమె నిర్ణయాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు..