ఆన్‌లైన్‌లో భద్రాద్రి రామయ్య కల్యాణం టికెట్లు..

*ఆన్‌లైన్‌లో భద్రాద్రి రామయ్య కల్యాణం టికెట్లు*

భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీరామ నవమి కల్యాణ బ్రహ్మోత్సవాలు ఏప్రిల్‌ 13-27వ తేదీ వరకు జరుగనున్నాయి. ఏప్రిల్‌ 21న సీతారాముల కల్యాణం, 22న పట్టాభిషేకం మహోత్సవం నిర్వహించనున్నారు. స్వామివారి కల్యాణం, పట్టాభిషేకానికి సంబంధించిన టికెట్లను ఆలయం అధికారులు ఆన్‌లైన్‌లో 20వేల టికెట్లును భక్తులకు అందుబాటులో ఉంచారు. రూ.5వేలు, రూ.2వేలు, రూ.1116, రూ.500, రూ.200, రూ.100 టికెట్ల భక్తులు బుక్‌ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. శుక్రవారం నుంచి www.bhadrachalamonline.com వెబ్‌సైట్‌లో బుక్‌ చేసుకోవచ్చని సూచించారు. రూ.5వేల టికెట్‌పై ఇద్దరికి ప్రవేశం కల్పించనున్నట్లు ఆలయ ఈఓ శివాజీ తెలిపారు. అలాగే పట్టాభిషేకం సైతం ఆన్‌లైన్‌లోనే అందుబాటులో ఉన్నాయని చెప్పారు. కల్యాణోత్సవానికి వీక్షించేందుకు 15వేల మందికి ఉచిత ప్రవేశం కల్పించనున్నట్లు పేర్కొన్నారు.