బీఎస్పీతో గౌర‌వ‌ప్ర‌ద‌మైన పొత్తు ఉంటుంది..బీఆర్ఎస్ అధినేత కేసీఆర్..

బీఎస్పీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్‌తో భేటీ ముగిసిన అనంత‌రం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. బీఎస్పీతో గౌర‌వ‌ప్ర‌ద‌మైన పొత్తు ఉంటుంద‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్.. బీఎస్పీ హైక‌మాండ్‌తో మాట్లాడి అనుమ‌తి తీసుకున్నారు. ఆ త‌ర్వాత బీఆర్ఎస్, బీఎస్పీ క‌లిపి ప‌ని చేయాల‌ని నిర్ణ‌యించామ‌న్నారు కేసీఆర్. సీట్ల స‌ర్దుబాటు, పొత్తు విధివిధానాలతో పాటు మిగ‌తా విష‌యాల‌న్ని రేపు, ఎల్లుండి ప్ర‌క‌టిస్తాం. కొన్ని సీట్ల‌లో వారు, మేం కొన్ని సీట్ల‌లో పోటీ చేస్తాం. నాగ‌ర్‌క‌ర్నూల్ నుంచి ప్ర‌వీణ్ కుమార్ పోటీ చేస్తారా..? అని మీడియా ప్ర‌తినిధులు ప్ర‌శ్నించ‌గా.. పెద్దప‌ల్లి నుంచి పోటీ చేయొద్దా..? రాష్ట్ర అధ్య‌క్షుడు క‌దా.. వ‌రంగ‌ల్ నుంచి కూడా పోటీ చేయొచ్చు. జ‌న‌ర‌ల్ సీట్ల‌లో కూడా పోటీ చేయొచ్చు అని కేసీఆర్ తెలిపారు.