బీఎస్పీకి ఆర్‌ఎస్ ప్రవీణ్ గుడ్‌బై..

బీఎస్పీకి ఆర్‌ఎస్ ప్రవీణ్ గుడ్‌బై
బహుజనులకు RS ప్రవీణ్‌ ట్వీట్
భారమైన హృదయంతో బీఎస్పీని వీడుతున్నట్టు ట్వీట్ లో తెలిపిన ఆర్‌ ఎస్ ప్రవీణ్
తప్పనిసరి పరిస్థితిలో ..

బహుజన్‌ సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ)కి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ గుడ్‌బై చెప్పారు. బీఎస్పీ పార్టీ తెలంగాణ చీఫ్‌ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆర్‌ఎస్ ప్రవీణ్‌ కుమార్‌ ప్రకటించారు. ‘బహుజన్ సమాజ్ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నాను. నా నాయకత్వంలో తెలంగాణలో ఇటీవల కాలంలో తీసుకున్న నిర్ణయాల (వాటికి ఎంత మంచి ప్రాముఖ్యత ఉన్నా) వల్ల బీఎస్పీ వంటి గొప్ప పార్టీ ఇమేజ్ దెబ్బతినడం నాకు ఇష్టం లేదు’ అని ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. ..

విధిలేకనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నా.
బీఆరెస్ పొత్తును విచ్చిన్నం చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తున్నది.

ఎన్నికల షెడ్యూల్ కు కొన్ని గంటల ముంటు కవిత అరెస్ట్ ఇందులో భాగమే –
పొత్తు ఒప్పందంలో భాగంగా ఎన్ని ఒడిదుడుకులొచ్చినా ముందుకు సాగాల్సిందే. కష్టసుఖాలు పంచుకోవాల్సిందే.

ఇదే నేను నమ్మిన నిజమైన ధర్మం. బీజేపీ కుట్రలకు భయపడి నేను నమ్ముకున్న విలువలకు తిలోదకాలు ఇవ్వలేను. నా ఈ ప్రస్థానాన్ని ఆపలేను.

స్వేరోస్ అందరూ నా నిర్ణయాన్ని అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. – RS ప్రవీణ్ తెలిపేరు…

ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌తో భేటీ కానున్నారు. ఇటీవల బీఆర్‌ఎస్‌-బీఎస్పీ పార్టీలు లోక్‌సభ ఎన్నికల కోసం పొత్తు ఖరారు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఎస్పీకి రాజీనామా చేసిన ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ బీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది.