కేంద్ర బడ్జెట్ 2021-22 హైలైట్స్..

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్ 2021- 22 ముఖ్యంగా ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల ఉపసంహరణ, ఎన్నికలు ఉన్న రాష్ట్రాల మీద దృష్టి పెట్టింది. ఆరోగ్య రంగం కోసం కేంద్రం కొత్త పథకం తీసుకొచ్చింది. ఆత్మనిర్భర ఆరోగ్య పథకానికి రూ. 2,23,486 కోట్లు, రక్షిత మంచినీటి పథకానికి రూ.87,000 కోట్లు, స్వచ్ఛభారత్ అర్బన్ పథకానికి రూ. 141679 కోట్లు ప్రతిపాదించింది. అలాగే, కరోనా వ్యాక్సినేషన్ కోసం రూ.35వేల కోట్లు కేటాయించింది. దేశంలోని పలు ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గెయిల్, ఐఓసీ, హెచ్‌పీసీఎల్ పైప్ లైన్లలో పెట్టుబడుల ఉపసంహరించాలని నిర్ణయిం తీసుకున్నారు…

కేంద్ర బడ్జెట్ ను అడ్డుకుంటున్న ప్రతిపక్షాలు..
రైతు చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రతిపక్షాల నినాదాలు..
నినాదాల మధ్యనే బడ్జెట్ ప్రవేశ పెడుతున్న నిర్మల సీతారామన్
లాక్ డౌన్ వల్ల అనేక సవాళ్ళను ఎదుర్కోవాల్సి వచ్చింది..
కనీవినీ ఎరుగని పరిస్థితుల్లో ఈ బడ్జెట్ ప్రవేశపెడుతునన్నాం..
కేంద్రం ప్రవేశపెట్టిన ఆత్మ నిర్భర్ ప్యాకేజీలు లాక్ డౌన్ కష్టాలను కొంతవరకు తగ్గించాయి..
ఐదు ప్యాకేజీలు 5 బడ్జెట్ లతో సమానం
పీఎం ఆత్మ నిర్భర్ భారత్ స్వస్థ యోజనకు శ్రీకారం..
64 వేల కోట్లతో పథకం..
6 మూల స్తంభాల మీద బడ్జెట్ 21..
మొదటి స్తంభం ఆరోగ్యం
ఆస్ట్రేలియాలో టీమ్ ఇండియా గెలిచినట్లే భారత ఆర్థిక రంగం పుంజుకుంది..
పౌష్టికాహారం అందరికీ అందించేందుకు మిషన్ పోషన్ 2.0..
స్వచ్ఛభారత్, స్వస్థ భారత్ ఈ బడ్జెట్ ముఖ్య లక్షణాలు
అర్బన్ స్వచ్ఛ భారత్ మిషన్ 2.0కు లక్ష 41 వేల కోట్లు..
కరోనా వ్యాక్సిన్ కోసం 35 వేల కోట్లు.. అవసరమైతే మరిన్ని నిధులు
ఆత్మ నిర్భర్ భారత్ ఆదర్శం కొత్తది కాదు..
మనదేశ మూలాల్లో నే ఆత్మ నిర్భర్ భావం ఉంది..
ఆర్థిక మూలస్తంభాలు మౌలిక రంగం రెండోది..
5 ట్రిలియన్ వృద్ధి సాధించాలంటే నిర్మాణ రంగం పుంజుకోవాలి..
త్వరలోనే మెగా ఇండస్ట్రియల్ టెక్స్టైల్ పార్క్..
మరిన్ని పరిశ్రమలను ఆకర్షించేందుకు ప్రభుత్వం మెగా స్కీం..
వ్యక్తిగత వాహనాల 20 ఏళ్లు, కమర్షియల్ వాహనాలకు పదిహేనేళ్ల పరిమితి..
కాలం తీరిన వాహనాలను తుక్కుగా మార్చేలా పథకం..
ప్రపంచ యుద్ధాల తర్వాత ఆర్థిక సామాజిక రంగాల్లో ప్రపంచం మారింది..
ఇప్పుడు కరోనా తర్వాత కూడా మనం మరో కొత్త ప్రపంచంలో ఉన్నాం..
ఎకానమీ పునరుజ్జీవానికి అవసరమైన చర్యలన్నీ ఈ బడ్జెట్లో ఉన్నాయి..
కరోనా పై యుద్ధం కొనసాగుతుంది
వ్యవసాయ ఆదాయం రెట్టింపు చేసేందుకు పథకాలు..
హెల్త్ కేర్ కు రెండు లక్షల కోట్లు.. జల్ జీవన్ మిషన్ కు 2.7 లక్షల కోట్లు..
రక్షిత మంచినీటి పథకానికి 87 వేల కోట్లు..
వాయు కాలుష్య నివారణకు 2217 కోట్లు..
గతేడాది కంటే ఈ బడ్జెట్లో ఆరోగ్యానికి 137 శాతం అధికంగా నిధులు..
కేపిటల్ వ్యయానికి 5.54 లక్షల కోట్లు..
దేశంలోని మరో నాలుగు ప్రాంతాల్లో వైరాలజీ ల్యాబ్ లు..
రహదారుల విస్తరణ కోసం న్యూ ఎకనమిక్ కారిడార్లు..
మూడేళ్లలో ఏడు టెక్స్టైల్ పార్కులు.. ప్రతి జిల్లాలో సమగ్ర హెల్త్ ల్యాబ్స్..
1100 కిలోమీటర్ల నేషనల్ హైవే కారిడార్ పూర్తి చేస్తాం..
మార్చి 22 కల్లా 8500 కిలోమీటర్ల దూరం అదనపు హైవేలు..
మెట్రో నిర్వహణ తగ్గించేందుకు రెండు కొత్త సర్వీసులు..
మెట్రో లైట్, మెట్రో న్యూ పేరుతో ప్రాజెక్టులు..
బెంగళూరులో మెట్రో విస్తరణకు 14700 కోట్లు..
చెన్నైలో మెట్రో విస్తరణకు 63 వేల కోట్లు..
భారత మాల కింద 13 వేల కిలోమీటర్ల జాతీయ రహదారుల అభివృద్ధి..
విద్యుత్ రంగానికి 3.05 లక్షల కోట్లు..
పీ పీ ఏ పద్ధతి ద్వారా 2,200 కోట్ల ఏడు కొత్త ప్రాజెక్టులు..
సోలార్ పవర్ రంగానికి మరో వెయ్యి కోట్లు..
జమ్మూకాశ్మీర్ లో గ్యాస్ పైప్ లైన్ ఏర్పాటు..
ఉజ్వల స్కీమ్ కింద మరో 9 కోట్ల మంది గ్యాస్ కనెక్షన్లు..
ఇన్సూరెన్స్ రంగంలో భారీగా ఎఫ్డిఐలు..
ఇన్సూరెన్స్ రంగంలో 74 శాతం వరకు ఎఫ్డిఐలకు అనుమతి..
ఏడాది రైల్వే లక్షా 10 వేల కోట్లు..
బ్యాంకింగ్ రంగంలో భారీ సంస్కరణలు..
బాడ్ బ్యాంక్ ఏర్పాటుకు నిర్ణయం..
ఎం పీ ఏ లు, మొండిబకాయిలు బ్యాడ్ బ్యాంకులకు తరలింపు..
బ్యాంకు ఖాతాలను సజావుగా నిర్వహించేందుకు చర్యలు..
రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది..
వ్యవసాయ ఉత్పత్తుల్లో భారీగా పెరుగుదల..
జాతీయ అంప్రెంటీస్ చట్టానికి సవరణలు.
యువతకు అవకాశాలు పెంచేలా కొత్త సవరణలు.
జాతీయ నూతన విద్యా విధానంలో భాగంగా 15 వేల పాఠశాలలు ఆధునీకరణ.
నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ విధివిధానాలు ఖరారు దశలో ఉన్నాయి.
రానున్న ఐదేళ్లలో నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్‌కు రూ.50 వేల కోట్లు.
డిజిటల్ చెల్లింపుల ప్రోత్సాహానికి రూ.1,500 కోట్లు.
త్వరలో జాతీయ భాషా అనువాద కార్యక్రమం.
రూ.4 వేల కోట్లతో డీప్ ఓషన్ మిషన్.
త్వరలో జాతీయ నర్సింగ్, మిడ్‌వైఫరీ కమిషన్ బిల్లు.
జనాభా లెక్కల కోసం రూ.3,726 కోట్లు.
దేశ చరిత్రలో తొలిసారి డిజిటల్ విధానంలో జనగణన.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు అంచనా 9.5 శాతం.
2021-22లో ద్రవ్యలోటును 6.8 శాతానికి పరిమితం చేయాలని లక్ష్యం.
ద్రవ్యలోటును ప్రభుత్వ అప్పుల ద్వారా భర్తీకి ప్రయత్నాలు.
ఈ 2 నెలల్లో ఇంకా రూ.80 వేల కోట్లు అప్పులు చేయాల్సి ఉంది.
వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.12 లక్షల కోట్లు అప్పులు తేవాలని నిర్ణయం.
2021-22 బడ్జెట్ అంచనా మొత్తం 34.83 లక్షల కోట్లు.
2025-26 నాటికి ద్రవ్యలోటును 4.5 శాతం లోపు పరిమితం చేయాలని లక్ష్యం.
15వ ఆర్థిక సంఘం సిఫార్సులకు కేంద్రం ఆమోదం.
పన్నుల్లో రాష్ట్రాలకు 41 శాతం వాటా.
పీఎంఏవై పథకం మరో ఏడాది పొడిగింపు.
అందుబాటు ధరల గృహరుణాల రాయితీ పథకం మరో ఏడాది పొడిగింపు.
అందుబాటు ధరల్లో గృహాలు నిర్మించే సంస్థలకు పన్ను విరామం మరో ఏడాది పొడిగింపు.
ఐటీ రిటర్న్ దాఖలకు మినహాయింపు.
75 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లకు ఊరట.
పింఛను, వడ్డీ ఆదాయం ఆధారంగా ఐటీ మినహాయింపు.
డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యం రూ. 1.75 లక్షల కోట్లు
2022లో ద్రవ్య లోటు అంచనా – జీడీపీలో 6.8 శాతం
2022లో స్థూల మార్కెట్ రుణాల లక్ష్యం రూ. 12 లక్షల కోట్లు
ఆర్ అండ్ డీలో ఇన్నోవేషన్‌కు ప్రోత్సాహం
నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ
15 వేల పాఠశాలలు శక్తివంతం
కొండ ప్రాంతాలలో ఏకలవ్య స్కూల్స్ కోసం రూ. 38 కోట్లు,
రూ. 40 కోట్లు కేటాయింపు
ఎన్‌జీఓలతో భాగస్వామ్యం ద్వారా 100 సైనిక్ స్కూల్స్ ఏర్పాటు
లెహ్, లడఖ్‌లో యూనివర్సిటీ ఏర్పాటు
దేశవ్యాప్తంగా ఐదు వ్యవసాయ హబ్‌లు
వ్యవసాయ రుణాల లక్ష్యం 16.5 లక్షల కోట్లు.
1000 మండీలను ఈనామ్‌తో అనుసంధానం.
తేయాకు తోటల కార్మికుల కోసం 1000కోట్లు
ప్రభుత్వ రంగ సంస్థల్లో భారీగా పెట్టుబడుల ఉపసంహరణ
ఎయిరిండియా, షిప్పింగ్‌ కార్పొరేషన్‌ పెట్టుబడులలో ఉపసంహరణకు గ్రీన్‌ సిగ్నల్‌

ఐడీబీఐ, భారత్‌ ఎర్త్‌ మూవర్స్‌ పెట్టుబడులలో ఉపసంహరణకు గ్రీన్‌ సిగ్నల్‌
ఈ ఏడాదిలోనే ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూ
దీని కోసం చట్టసవరణ
2021-22లో పవన్‌ హన్స్‌, ఎయిరిండియా ప్రైవేటీకరణ
50లక్షల నుంచి 2కోట్ల పెట్టుబడి పరిమితి వరకూ చిన్న సంస్థలుగా గుర్తింపు.
కొత్త ప్రాజెక్టుల కోసం ప్రస్తుత ప్రాజెక్టుల్లో పెట్టుబడుల ఉపసంహరణ తప్పనిసరి.
5లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం చేరాలంటే రెండంకెల వృద్ధి తప్పనిసరి.
సొలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాకి వెయ్యి కోట్లు
బ్యాంక్ ఖాతాదారులకు ఇన్సూరెన్స్ లక్ష నుంచి 5 లక్షలకు పెంపు