బస్సులోంచి కింద పడ్డ డబ్బులు తీసుకుని మహిళ పరార్..

బస్సులోంచి కింద పడ్డ డబ్బులు తీసుకుని ఓ మహిళ పరారైంది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట నియోజక వర్గంలో ఈరోజు మధ్యాహ్నం చోటు చేసుకుంది.

అచ్చంపేట బస్టాండ్‌లోకి ప్రవేశించిన బస్సులోంచి రూ.లక్ష నగదు ఉన్న బ్యాగు కింద పడింది. అటుగా వస్తున్న ఓ మహిళ బ్యాగును తీసుకుని ఏమి తెలియనట్లు వెళ్లిపోయింది.

దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా మహిళ కోసం గాలిస్తున్నారు.