రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధ వేళ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పోలండ్‌లో పర్యటన…

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధ వేళ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పోలండ్‌లో అడుగుపెట్టారు. ఉక్రెయిన్‌కు కేవలం వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలండ్ దక్షిణ ప్రాంతంలోని జేజౌ (Rzeszow) నగరానికి చేరుకున్నారు. పర్యటనలో భాగంగా ఆయన ఉక్రెయిన్ నుంచి వలస వచ్చిన శరణార్ధులకు అందుతున్న సహాయక చర్యలను సమీక్షిస్తారు. నాటో బలగాలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. బైడెన్ పర్యటన నేపథ్యంలో పోలండ్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశాయి. ఉక్రెయిన్‌కు సరిహద్దులో ఉన్న యూరోపియన్ యూనియన్ దేశాలు అప్రమత్తమయ్యాయి. ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యా రసాయన ఆయుధాలు ఉపయోగించినా తాము ఉపయోగించబోమని అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం వెల్లడించింది. ముడి చమురు విషయంలో రష్యాపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు ఒక జాయింట్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఈయూ, అమెరికా నిర్ణయించాయి…