హుజూరాబాద్‌, బద్వేలులో ముగిసిన పోలింగ్‌..

*హుజూరాబాద్‌, బద్వేలులో ముగిసిన పోలింగ్‌..*

*ఫలితంపైనే ఉత్కంఠ…!

తెలుగు రాష్ట్రాల్లోని హుజూరాబాద్‌, బద్వేల్‌లో నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక పోలింగ్‌ ముగిసింది. కొన్ని ప్రాంతాల్లో స్వల్ప ఉద్రిక్తతలు మినహా పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. తెలంగాణలోని కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌, ఏపీలోని కడప జిల్లా బద్వేలు నియోజకవర్గాల్లో ఉదయం నుంచే ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చారు. సాయంత్రం 5గంటల వరకు హుజూరాబాద్‌లో 76.26శాతం పోలింగ్‌ నమోదు కాగా.. బద్వేలులో 59.58శాతం నమోదైంది. రాత్రి 7గంటల వరకు పోలింగ్‌ కొనసాగడంతో పోలింగ్‌ శాతం భారీగా పెరిగే అవకాశం ఉంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్‌లో 84.5శాతం పోలింగ్‌ నమోదైన విషయం తెలిసిందే. నువ్వా నేనా అన్నట్టుగా సాగిన ఈ ఉత్కంఠ పోరు ఫలితాలు నవంబర్‌ 2న తేలనున్నాయి.