పీఎస్‌ఎల్‌వీ-సీ54 (PSLV-C54) రాకెట్‌ ప్రయోగం విజయవంతం…

పీఎస్‌ఎల్‌వీ-సీ54 (PSLV-C54) రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి ఇవాళ రాకెట్‌ను ప్రయోగించింది. ఉదయం 11.56 గంటలకు రాకెట్‌ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. మన దేశానికి చెందిన 1,117 కిలోల బరువుగల ఓషన్‌ శాట్‌-3 (ఈవోఎస్‌-06) ఉపగ్రహంతోపాటు మరో 8 ఉపగ్రహాలను రోదసిలోకి మోసుకెళ్లింది.