హైదరాబాద్‌లో కాల్ మనీ కలకలం…!!అప్పు తీర్చకపోతే కోరిక తీర్చాలని యువతిపై ఓ యువకుడు ఒత్తిడి..!

హైదరాబాద్‌లో కాల్ మనీ(call Mani) కలకలం రేపింది. అప్పు తీర్చకపోతే కోరిక తీర్చాలని యువతిపై ఓ యువకుడు ఒత్తిడి చేశాడు. గత్యంతరం లేక యువకుడితో ఉండేందుకు యువతి అంగీకరించింది. అయితే యువతికి తెలియకుండా సదరు యువకుడు వీడియోలు(video) తీశాడు. అంతటితో ఆగకుండా తన స్నేహితులకు వీడియోలను యువకుడు పంపాడు. తమ స్నేహితులతో కూడా గడపాలని నిందితుడు యువతిపై ఒత్తిడి చేస్తున్నాడు. నిందితుడు ఒత్తిడి తెచ్చినా యువతి అంగీకరించలేదు. దీంతో యువతికి నిందితుడి స్నేహితుడు వీడియోలు పంపాడు. యువతి వీడియోలను నిందితులు వైరల్ చేశారు. దీంతో బాధితురాలు షీ టీమ్‌ను ఆశ్రయించింది.