జీ20 సదస్సు కోసం భారత్ వచ్చిన కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో విమానంలొ తలెత్తిన సాంకేతిక లోపం..

జీ20 సదస్సు కోసం భారత్ వచ్చిన కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో
(Justin Trudeau)..
తన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఇక్కడే చిక్కుకుపోయారు.
తాజాగా ఆ సాంకేతిక లోపాన్ని సరిదిద్దినట్లు కెనడా ప్రధాన మంత్రి కార్యాలయం
(Canada PMO) వెల్లడించింది. కెనడా ప్రధాని విమానంలో తలెత్తిన సాంకేతిక లోపం పరిష్కారమైంది. విమానం టేకాఫ్‌ అయ్యేందుకు అనుమతులు వచ్చాయి. కెనడా ప్రతినిధులు ఈ మధ్యాహ్నం భారత్‌ నుంచి బయలుదేరే అవకాశం ఉంది’ అని కెనడా పీఎంఓ ప్రెస్‌ సెక్రటరీ మహమ్మద్‌ హుస్సైన్‌ మీడియాకు వెల్లడించారు. ఒకవైపు ట్రూడోను తీసుకెళ్లడానికి మరో విమానం భారత్‌కు వస్తోన్న తరుణంలో.. ఈ సమస్య కొలిక్కి రావడం గమనార్హం. కెనడా(Canada)లో ఖలిస్థానీ సానుభూతిపరుల ఆందోళనలపై భారత్‌ అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ.. ట్రూడో
( Justin Trudeau) ప్రభుత్వం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే జీ20 సదస్సుకు వచ్చిన ట్రూడో పర్యటన సాంతం అసౌకర్యంగానే కనిపించారు. ఈ సమయంలో ఆయన్ను తన విమానమే ఇబ్బందిపెట్టేసింది. ఆదివారం సాయంత్రం భారత్‌ వీడాల్సిన ఆయన..
రెండు రోజులుగా ఇక్కడే ఉంటున్న సంగతి తెలిసిందే…