భారత్తో సత్సంబంధాలు కొనసాగించడం మాకెంతో అవసరం..కెనడా ప్రధాని ట్రుడో.

భారత్తో సత్సంబంధాలు కొనసాగించేందుకు కెనడా ఇప్పటికీ సిద్ధంగానే ఉందని వెల్లడించారు. నిజ్జర్ హత్య విషయంలో తాము భారత్పై చేసిన ఆరోపణలు చేసినప్పటికీ ద్వైపాక్షిక బంధం విషయానికొచ్చినప్పుడు వాటిని పక్కన పెట్టేస్తామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా భారత్ ఎలాంటి ప్రభావం చూపిస్తోందో గమనిస్తున్నామన్న ట్రూడో…భారత్తో మైత్రి కొనసాగించడం తమకు ఎంతో ముఖ్యమని తేల్చి చెప్పారు. ఓ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడిన…ఈ వ్యాఖ్యలు చేశారు.

“భారత్తో సత్సంబంధాలు కొనసాగించడం మాకెంతో అవసరం. అంతర్జాతీయంగా భారత్ ఎలాంటి ప్రభావం చూపిస్తోందో గమనిస్తున్నాం. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా ఎదుగుతోంది. జియోపొలిటికల్ పరంగా చూసినా ఆ దేశానిది కీలక పాత్ర. ఇండో పసిఫిక్ స్ట్రాటెజీలోనూ ఆ దేశం ముఖ్య పాత్ర పోషిస్తోంది. అందుకే భారత్తో బంధాన్ని బలోపేతం చేసుకోవాలని చూస్తున్నాం. కానీ ఇదే సమయంలో కొన్ని విషయాల్లో భారత్ మాకు సహకరించాలి.