జూబ్లీహీల్స్ రోడ్ నంబర్ 45 వద్ద కారు ప్రమాదంపై బోధన్ ఎమ్మెల్యే షకీల్ స్పందించారు.. .

కారు ప్రమాదంపై బోధన్ ఎమ్మెల్యే షకీల్ స్పందించారు.. కారు తనది కాదని..
కారు నడిపింది తన కొడుకు కాదని చెప్పారు. ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని చెప్పారు. కారు తన కజిన్ ది అన్నారు. కజిన్ కొడుకే కారు నడిపాడని చెప్పారు షకీల్. ఘటన జరిగినప్పుడు డ్రైవర్ ను కొట్టడంతో అంతా పారిపోయారని..
ఆ టైంలో తల్లే బిడ్డను భయంతో పడేసిందని చెప్పారు. బాధితులను అన్ని విధాల ఆదుకోవాలని.. తన కసిన్ తో మాట్లాడినట్లు చెప్పారు షకీల్. ఈ విషయంలో పోలీసులు కూడా చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు . గురువారం జూబ్లీహీల్స్ రోడ్ నంబర్ 45 వద్ద కారు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక పసికందు మృతి చెందింది. అయితే ప్రమాదానికి గురైన కారుపై బోధన్ ఎమ్మెల్యే షకీల్ పేరుతో స్టిక్కర్ ఉండటం వివాదాస్పదంగా మారింది. కారు షకీల్ బంధువులదా? షకీల్ దా అనేదానిపై పోలీసులు విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే షకీల్ వివరణ ఇచ్చారు.