కారు డ్రైవర్ ఖాతాలో 9 వేల కోట్లు జమ చేసిన బ్యాంక్ అధికారులు..!

పొరపాటున కారు డ్రైవర్ ఖాతాలో 9 వేల కోట్లు జమ చేసిన బ్యాంక్ అధికారులు..

చెన్నైకి చెందిన రాజ్‌కుమార్ కారు డ్రైవరుగా పనిచేస్తున్నాడు. ఈ నెల 9న అతడి మొబైల్‌కు తమిళనాడు మర్కెంటైల్ బ్యాంకు నుంచి 9 వేల కోట్లు డబ్బు జమ అయినట్టు మెసేజ్ వచ్చింది.

నిజమో కాదో తెలుసుకునేందుకు తన స్నేహితుడికి రూ.21 వేలు బదిలీ చేసి చూడగా ట్రాన్స్ఫర్ అయ్యాయి. వెంటనే బ్యాంకు అధికారులు రాజ్‌కుమార్‌కు ఫోన్ చేసి పొరపాటున రూ.9 వేల కోట్లు బదిలీ అయ్యిందని, తన స్నేహితుడికి పంపిన డబ్బుతో పాటూ మొత్తం సొమ్మును తమకు అప్పగించాలన్నారు.

రాజ్‌కుమార్ న్యాయవాదులను సంప్రదించగా వారు వెళ్లి బ్యాంకు అధికారులతో మాట్లాడటంతో రూ.21 వేలు వెనక్కు ఇవ్వాల్సిన పనిలేదని, పైగా వాహన రుణం ఇస్తామని బ్యాంకు అధికారులు చెప్పారు. దీంతో కథ సుఖాంతం అయ్యింది.