కరెంట్ బిల్లులు కట్టొద్దు.. కేటీఆర్.

కరెంట్ బిల్లులు కట్టొద్దు..

రాష్ట్ర ప్రజలు జనవరి నెల కరెంట్ బిల్లులు కట్టొద్దని, ఉచిత కరెంట్ఇస్తామన్న కాంగ్రెస్ హామీని నెరవేర్చే వరకు బిల్లులు కట్టొద్దని కేటీఆర్ అన్నారు. ”బిల్లుల వసూళ్ల కోసం వచ్చే అధికారులకు ఎన్నికలకు ముందు రేవంత్ మాట్లాడిన వీడియోలు చూపించాలి. ప్రతి ఇంటికి వస్తున్న కరెంట్ బిల్లుల కాపీలను సోనియా గాంధీ నివాసం 10 జన్‌పథ్‌కు పంపాలి’ అని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ప్రతి మీటర్‌కు గృహజ్యోతి పథకం కింద ఉచిత కరెంట్ఇవ్వాలని డిమాండ్ చేశారు. కిరాయి ఇండ్లలో ఉండేవాళ్లకు ఈ సదుపాయం కల్పించాలన్నారు. మహాలక్ష్మీ పథకంలో భాగంగా ప్రతి మహిళలకు నెలకు రూ.2,500 వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆరు గ్యారంటీల హామీల అమలు నుంచి తప్పించుకోవాలని చూస్తే వదిలిపెట్టేది లేదని కేటీఆర్ హెచ్చరించారు. బీజేపీతో తాము ఇప్పటి వరకు పొత్తు పెట్టుకోలేదని, భవిష్యత్‌లోనూ ఉండబోదన్నారు..