వన్యప్రాణుల కోసం ఏర్పాటు చేసిన కరెంట్ కంచేకు కానిస్టేబుల్ మృతి…

తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కరెంట్ షాక్ తో ఆదివారం సాయంత్రం ఓ కానిస్టే బుల్ మృతి చెందాడు.

వన్యప్రాణాల కోసం ఏర్పాటుచేసిన కరెంటు వైర్లు తగిలి విధి నిర్వహ ణలో ఉండగానే ప్రాణాలు కోల్పోయాడు. కాటారం మండల పరిధిలోని నస్తూర్ పల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే…

భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూర్ పల్లి గ్రామ అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు సంచరిస్తున్నారనే సమాచారం స్థానిక పోలీస్ స్టేషన్ కు అందింది.

దీంతో కానిస్టేబుల్ ప్రవీణ్ అడవిలో మరికొందరు సిబ్బందితో కలిసి కూబింగ్ కు వెళ్ళాడు. ఈ క్రమంలో వణ్యప్రాణులు వేట కోసం ఏర్పాటు చేసిన కరెంటు వైర్లు తగిలి ప్రవీణ్ స్పాట్ లోనే ప్రాణాలు వదిలారు.

ఈ మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని కరెంట్ షాక్ ట్రాప్ ను పెట్టిన నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు.