కరెంట్ కనెక్షన్ కు సెల్ ఫోన్ నెంబరు ఇవ్వాలి..

హైదరాబాద్‌: కరెంటు కనెక్షన్‌ ఉన్న ప్రతి వినియోగదారుడు తమ ఫోన్‌ నంబరును విద్యుత్‌ రెవెన్యూ కార్యాలయంలో అందజేయాలని విద్యుత్‌ అధికారులు కోరుతున్నారు. కరెంటు బిల్లు, తదితర వివరాలను ఎప్పటికప్పుడు ఫోన్‌ నంబరుకు సంక్షిప్త సందేశం రూపంలో ‘విద్యుత్‌ పంపిణీ సంస్థ’(డిస్కం) పంపుతుంది. కొందరు వినియోగదారుల నంబర్లు లేకపోవడంతో సందేశాలు వెళ్లడం లేదని అధికారులు తెలిపారు.