ఎంవీ లీలా నార్ఫోక్ కార్గో షిప్ హైజాక్‌..షిప్ పై ఉన్న 15 మంది భారతీయులు సహా మొత్తం 21 ప్రయాణికులు సురక్షితం..!

అరేబియా సముద్రంలో హైజాక్‌కు గురైన కార్గో షిప్‌ను ఇండియన్ నేవీ ట్రేస్ చేసింది. ఆ షిప్ పై ఉన్న 15 మంది భారతీయులు సహా మొత్తం 21 ప్రయాణికులు, సిబ్బందిని కాపాడింది. వారంతా సేఫ్‌గా ఉన్నారని అధికారులు వెల్లడించారు. ఆ షిప్ పై హాజకర్లు ఎవరూ లేరని పేర్కొంది..గురువారం సాయంత్రం ఎంవీ లీలా నార్ఫోక్ కార్గో షిప్ హైజాక్‌కు గురైంది. సోమాలియా తీరంలో ఈ ఘటన జరిగింది. దీన్ని యూకే మేరిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ గుర్తించింది. వ్యూహాత్మక జలాల్లో నావల కదలికలను ట్రాక్ చేసే ఈ మేరిటైమ్ ఎంవీ లీలా నార్ఫోక్ కార్గో షిప్ హైజాక్ అయినట్టు వెల్లడించింది. దీంతో ఇండియన్ నేవీ అలర్ట్ అయింది. ఎలైట్ కమాండోస్ మార్కోస్ రంగంలోకి దిగింది.నేవీ డెస్ట్రాయర్ ఐఎన్ఎస్ చెన్నై నావల్ వార్షిప్.. పహారా బాధ్యతల నుంచి వీరిని కాపాడటానికి బయల్దేరింది. ఈ ఐఎన్ఎస్ చెన్నై హెలికాప్టర్‌ను పంపింది. హైజాక్ చేసిన పడవల నుంచి పైరేట్లు వెంటనే పారిపోవాలని వార్నింగ్ ఇచ్చింది. ఆ తర్వాత వారిని చేరుకుని కాపాడింది..సముద్ర గస్తీ ఎయిర్‌క్రాఫ్ట్ నుండి వారికి పదేపదే హెచ్చరికలు జారీ చేయడంతో నౌకాదళం బయలుదేరే సమయానికి సముద్రపు దొంగలు ఓడను విడిచిపెట్టారు, ఇది పై నుండి నిఘా ఉంచే నేవీ విమానంతో పాటు దగ్గరి నిఘాను కొనసాగించింది.