Recover your password.
A password will be e-mailed to you.
మూవీ న్యూస్
సినీ డ్రగ్స్ రాణులపై కఠిన చర్యలు రాగిణి జైలుకు, సంజన కస్టడీకి..
మాదకద్రవ్యాల కేసులో అరెస్టయిన కన్నడ హీరోయిన్లు జైలు ఊచలు లెక్కపెట్టాల్సిందే. నటి రాగిణి ద్వివేదికి ఈ రోజుతో కస్టడీ ముగియడంతో న్యాయస్థానం రాగిణికి జ్యుడిషియల్ కస్టడీని 14 రోజుల పాటు పొడిగించింది. తన ఆరోగ్యం బాగోలేదని, ప్రైవేటు ఆస్పత్రిలో చేరేందుకు అనుమతి ఇవ్వాలంటూ రాగిణి చేసిన అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది. పరప్పన అగ్రహారం జైలు లోపల ఉన్న ఆస్పత్రిలో చికిత్స పొందవచ్చని సూచించింది.అలాగే, మరో నటి సంజనా గల్రానీని మరో మూడు రోజుల పాటు సీసీబీ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీచేసింది. ఇప్పటికే రాగిణిని 12 రోజులు, సంజనను ఏడు రోజుల పాటు సీసీబీ అధికారులు విచారించారు. అయితే, సంజనను మరో ఐదు రోజుల పాటు విచారణకు ఇవ్వాలని కోరగా.. న్యాయస్థానం మూడు రోజుల విచారణకు అనుమతిచ్చింది. ఆమె ఫోన్‌లో ఉన్న డేటా ఆధారంగా విచారించన్నట్టు తెలుస్తోంది. కోర్టు తాజా ఆదేశాలతో రాగిణి ఈ నెల 28 వరకు జ్యుడిషియల్ కస్టడీలో ఉండనున్నారు.