చంద్రబాబు విచారణకు సహకరించలేదు – సీఐడీ స్పెషల్ పిపి..

చంద్రబాబు విచారణకు సహకరించలేదు – సీఐడీ స్పెషల్ పిపి.

స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుకి మరో షాక్ తగిలింది. చంద్రబాబు రిమాండ్ ను మరోసారి పొడిగించింది విజయవాడ ఏసీబీ కోర్టు. చంద్రబాబు రిమాండ్ ను 11 రోజుల పాటు అంటే అక్టోబర్ 5వ తేదీ వరకు పొడిగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు. చంద్రబాబు రిమాండ్ తొలుత ఈ నెల 22వ తేదీతో ముగిసింది. ఆ తర్వాత కోర్టు 2 రోజులు రిమాండ్ పొడిగించి సీఐడీ కస్టడీకి అప్పగించిన విషయం తెలిసిందే. నేటితో(సెప్టెంబర్ 24) రిమాండ్, కస్టడీ ముగియగా.. మరోమారు రిమాండ్ ను పొడిగించింది కోర్టు…జ్యుడీషియల్ రిమాండ్, కస్టడీ ముగియడంతో జైలు అధికారులు చంద్రబాబును వర్చువల్ గా (వీడియో కాన్ఫరెన్స్) న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో న్యాయమూర్తి 2 నిమిషాలు మాట్లాడారు. పలు ప్రశ్నలు అడిగారు. చంద్రబాబు ఆరోగ్యం గురించి వాకబు చేవారు. విచారణ సమయంలో సీఐడీ అధికారులు మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టారా? థర్డ్ డిగ్రీ ప్రయోగించారా? వైద్య పరీక్షలు నిర్వహించారా? అని చంద్రబాబుని అడిగారు జడ్జి. దీనికి చంద్రబాబు సమాధానం ఇచ్చారు. తనను అధికారులు ఎలాంటి ఇబ్బంది పెట్టలేదని, గైడ్ లైన్స్ ఫాలో అయ్యారని, వైద్య పరీక్షలు చేశారని చంద్రబాబు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇక, బెయిల్ పిటిషన్ పై సోమవారం వాదనలు వింటామని చంద్రబాబుతో చెప్పారు న్యాయమూర్తి.(Chandrababu CID Interrogation)..

ఆంధ్రప్రదేశ్‌ స్కిల్ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడిపై సీఐడీ రిమాండ్‌ రిపోర్ట్‌లో సంచలన అభియోగాలు చేసింది. స్కిల్‌ స్కామ్‌లో చంద్రబాబుకు పూర్తి అవగాహన ఉందని సీఐడీ చెబుతోంది. చంద్రబాబు ఆదేశాల మేరకే డబ్బులు విడుదలయ్యాయని తెలిపారు. ఏసీబీ కోర్టులో హోరాహోరీగా వాదనలు నడుస్తున్నాయి. ఇక నారా లోకేష్‌ సైతం కోర్టులోనే ఉన్నారు. చంద్రబాబు తరఫున లాయర్ సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపిస్తున్నారు. ఇక సీఐడీ తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదిస్తున్నారు. సీఐడీ తరపున వివేకా చారి, వెంకటేష్‌ న్యాయవాదులు హాజరయ్యారు.

ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. కోర్టు ఆవరణలో భారీకేడ్లు ఏర్పాటు చేశారు. శాంతిభద్రతలకు ఎలాంటి భంగం కలగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉంటే చంద్రబాబును సీఐడీ అధికారులు శనివారం సాయంత్రం నుంచి విచారణ ప్రారంభించారు. శనివారం సాయంత్రం 5.10 గంటల నుంచి ఆదివారం ఉదయం 3 గంటల వరకు విచారణ సాగింది. చంద్రబాబును ఏకంగా 10 గంటల పాటు విచారించారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం 3 గంటల వరకు చంద్రబాబు నాయుడు సిట్ కార్యాలయంలో ఉన్నారు.
అనంతరం ఉదయం 3 గంటలకు సిట్ కార్యాలయం నుంచి బాబును ఆసుపత్రికి తరలించారు..

చంద్రబాబు విచారణకు సహకరించలేదు – సీఐడీ స్పెషల్ పిపి.

చంద్రబాబు నాయుడు విచారణకు అసలు సహకరించడం లేదని,, ఏ ప్రశ్న వేసిన దాటవేసే సమాధానాలు చెప్తున్నారని దీంతో పూర్తిస్థాయిలో విచారణ కొనసాగటం కొంత ఇబ్బందికరంగా మారుతుందని తెలిపారు.. ఇదే విషయాన్ని కోర్టుకు కూడా తెలుపుతున్నట్లు సిఐడి సమాచారం…… విచారణ ముందుకు సాగాలంటే చంద్రబాబు కోర్టుకు నివేదిక అందించడం జరుగుతుందని అన్నారు..