చంద్రబాబు కస్టడీ పిటిషన్ తీర్పు వాయిదా..

చంద్రబాబు కస్టడీ పిటిషన్ తీర్పు వాయిదా

రేపు ఉదయం 11:30కి తీర్పు వాయిదా వేసిన విజయవాడ ఏసీబీ కోర్ట్…

విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. తీర్పు రేపటికి (సెప్టెంబర్ 21) వాయిదా వేసింది కోర్టు. రేపు ఉదయం 11.30గంటలకు తీర్పు ఇవ్వనుంది ఏసీబీ కోర్టు. చంద్రబాబును 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై హాట్ హాట్ గా వాదనలు జరిగాయి. చంద్రబాబు తరపున సిద్ధార్ధ లూథ్రా, ప్రభుత్వం తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు..చంద్రబాబుని సీఐడీ కస్టడీకి ఇవ్వాలని, అప్పుడే అసలు నిజాలు బయటకు వస్తాయని వాదించారు. ఇక, చంద్రబాబు అవినీతి చేసినట్లు ఆధారాలు లేవని, అరెస్ట్ ప్రక్రియ నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని, చంద్రబాబు తరపు న్యాయవాది లూథ్రా వాదించారు. చంద్రబాబు అరెస్ట్ రాజకీయ కుట్రతో జరిగిందన్నారు. కస్టడీ అవసరమే లేదని వాదించారు లూథ్రా. ఇరుపక్షాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు కస్టడీ పిటిషన్ పై తీర్పును రేపటికి వాయిదా వేసింది..