నన్ను అకారణంగా జైల్లో పెట్టారంటూ జడ్జి ముందు కన్నీళ్లు చంద్రబాబు..!చంద్రబాబును జైల్లోనే విచారిస్తామన్న సీఐడీ….!

నన్ను అకారణంగా జైల్లో పెట్టారంటూ ఆవేదనతో జడ్జి ముందు కన్నీటి పర్యంతమైన చంద్రబాబు..

నన్ను అకారణంగా జైల్లో పెట్టారు, నా బాధ, ఆవేదనంతా అదే. నా గురించి దేశంలో, రాష్ట్రంలో అందరికీ తెలుసని జడ్జికి చంద్రబాబు మొరపెట్టుకున్నారు.

ఈ రోజు వీడియో కాన్ఫిరెన్స్ లో బాబును జడ్జి ముందు సిఐడి ప్రవేశపెట్టింది. ఆ సమయంలో చంద్రబాబు తన బాధని వెళ్లగక్కారు. దాదాపూ కన్నీటి పర్యంతమైన బాబు ఆవేదనతో మాట్లాడినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో చంద్రబాబు చెప్పిన విషయాలు నోట్ చేసుకున్నానన్న జడ్జి, చట్టం అందరికీ సమానమని అన్నారు. మీపై కేవలం ఆరోపణలు మాత్రమే వచ్చాయి. దర్యాప్తులో అన్ని విషయాలు తేలుతాయి. అంతేకానీ రిమాండ్ ను శిక్షగా భావించొద్దు. ఇది చట్ట ప్రకారం జరుగుతున్న కార్యక్రమం అని జడ్జి బాబుకి చెప్పారు…

చంద్రబాబును జైల్లోనే విచారిస్తామన్న సీఐడీ..

చంద్రబాబు నాయుడును సీఐడీ కస్టడీకి ఇవ్వగా రేపు, ఎల్లుండి విచారణకు అనుమతినిచ్చిన ఏసీబీ కోర్ట్.

జైలులోనే విచారించనున్న సీఐడీ. ఉదయం 9:30 నుండి సాయంత్రం 5 గంటలవరకు విచారణ

మూడు కండిషన్స్ తో విచారణకు అనుమతినిచ్చిన ఏసీబీ కోర్ట్

1. సీల్డ్ కవర్లో నివేదిక ఇవ్వాలి
2. విచారణ అధికారుల జాబితా ఇవ్వాలి
3. వీడియోలు, ఫొటోలు బయటకి రాకూడదు.