పిల్లలే మన రాష్ట్ర సంపద అని, వారితోనే మన ఆర్థిక ప్రగతి ముడిపడి ఉందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రపంచజనాభా దినోత్సవం సందర్భంగా విజయవాడ అంబేద్కర్ కళావేదికలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిల్లల్ని పెంచే బాధ్యతను కేవలం తల్లులే కాకుండా తండ్రులు కూడా తీసుకోవాలని సూచించారు. ఆడవాళ్లకు మగవాళ్లు అన్ని పనుల్లోనూ సహాయం చేయాలని, ఇంటిపని, వంటపని అని తేడా చూడకూడదని హితవు పలికారు. అలాగే సోషల్ మీడియాను విపరీతంగా వాడటం వల్ల మానసిక సమస్యలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విలువైన సమయాన్ని వృథా చేసుకుంటున్నారని, నియంత్రణ లేకుంటే ఏ టెక్నాలజీ అయినా ప్రమాదమేనన్నారు. మెంటల్ సిక్ నెస్ అనేది ఇప్పుడు అతిపెద్ద సమస్యగా తయారైందన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.