ఏపీలో అశాస్త్రీయంగా, రాజకీయ కోణంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అధికారంలోకి వచ్చాక కొత్త జిల్లాలను సరిదిద్దుతామన్నారు.
సోమవారం పార్టీ నేతలతో చంద్రబాబు వ్యూహ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్ విధానాలతో ఏపీ కూడా శ్రీలంకలా మారే ప్రమాదం ఏర్పడిందని అన్నారు. జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై ప్రజల అభ్యంతరాలను, నిరసనలను కనీసం పరిగణనలోకి తీసుకోలేదన్నారు…విద్యుత్ చార్జీల పెంపు, పన్నుల భారంపై ‘బాదుడే బాదుడు` పేరుతో ఇంటింటి ప్రచారం చేస్తామని చెప్పారు. కరెంటు ఎందుకు పోతోందో, బిల్లులు ఎందుకు పెరిగాయో సీఎం చెప్పాలని నిలదీశారు. జగన్ పాలనపై ఆయన సొంత సామాజికవర్గం కూడా సంతృప్తిగా లేదన్నారు. ప్రధాని వద్ద ఉన్నతాధికారుల వ్యాఖ్యలే..రాష్ట్ర పరిస్థితికి దర్పణమన్నారు. అమరావతిలో 80 శాతం జరిగిన పనులను కూడా జగన్ పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. కల్తీ మద్యం, జె-ట్యాక్స్ పై పోరాటం కొనసాగిస్తామని చెప్పారు….