ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగే రాజకీయ పార్టీల అధ్యక్షుల సమావేశానికి చంద్రబాబు..

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగే రాజకీయ పార్టీల అధ్యక్షుల సమావేశంలో పాల్గొనాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. భారత్‌లో నిర్వహించే జీ-20 భాగస్వామ్య దేశాల సమావేశాలను ఎలా నిర్వహిస్తే బాగుంటుందనే అంశంపై చర్చించనున్నారు. ఈమేరకు సమావేశానికి హాజరు కావాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి చంద్రబాబుకు ఫోన్‌ చేసి ఆహ్వానించారు. సమావేశానికి ఉన్న ప్రాధాన్యతను బాబుకు వివరించారు. డిసెంబర్‌ 5న సాయంత్రం 5.00 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో సదస్సు జరగనుంది. జీ-20 దేశాల కూటమికి భారత్‌ అధ్యక్షత వహిస్తున్న సంగతి తెలిసిందే…