చంద్రబాబు పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు.బండి సంజయ్..

చంద్రబాబుకు మద్దతు తెలిపిన బండి సంజయ్.

విడియో చూడలనుకుంటే క్రింది లింక్ ఓకే చెయ్యండి.
https://youtube.com/shorts/AJY3r2dClSk?si=2ExJfZ4-4fD7eSUm

చంద్రబాబు పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు, ఎఫ్ఐఆర్‌లో పేరు లేకుండా అరెస్ట్ చేస్తారా? ఏదైనా ఉంటె రాజకీయంగా కొట్లాడాలి కానీ ఇలా చెయ్యడం వల్ల వైసీపీ వాళ్ళ గోతిలో వాళ్ళే పడ్డారు ఇప్పుడు
ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. ఏదైనా ఉంటే రాజకీయంగా కొట్లాడాలే తప్ప, ఇలాంటి కక్ష సాధింపులకు పాల్పడకూడదని విమర్శించారు. చంద్రబాబును టార్గెట్ చేసే అరెస్ట్ చేశారని దుయ్యబట్టారు. మాజీ సీఎం అరెస్ట్ విషయంలో కనీస రూల్స్ కూడా పాటించలేదని మండిపడ్డారు…చంద్రబాబు అరెస్ట్ వైసీపీకి చాలా మైనస్ అని… వాళ్లు తవ్వుకున్న గోతిలో వాళ్లే పడతారని అన్నారు.

ఇప్పుడు చంద్రబాబుకు భారీగా మైలేజ్ పెరిగిందని… ఎక్కడకు పోయినా వైసీపీ ప్రభుత్వం తప్పు చేసిందని అంటున్నారని సంజయ్ చెప్పారు. ఇలాంటి అరెస్ట్ తప్పని అందరూ అంటున్నారని తెలిపారు. తప్పు చేసిన వాళ్లను అరెస్ట్ చేయాల్సిందేనని, శిక్ష పడాల్సిందేనని, అయితే చంద్రబాబును కక్ష పూరితంగా అరెస్ట్ చేసినట్టు స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. ప్రజల్లో వ్యతిరేకత వస్తోందని, ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తోందని… పార్టీలు, రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులు కూడా దీనిపై స్పందిస్తున్నారని చెప్పారు. రాజకీయాలతో సంబంధం లేకుండా అన్ని రాజకీయ పార్టీలు చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తున్నాయని తెలిపారు.