చంద్రబాబు అరెస్టుపై స్పందించిన రేవంత్ రెడ్డి…

చంద్రబాబు అరెస్టుపై స్పందించిన రేవంత్ రెడ్డి…

చంద్రబాబు అరెస్ట్ అనేది ఒక రాష్ట్రానికి పరిమితమైనది కాదు. చంద్రబాబు ఒక రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాదు. చంద్రబాబు జాతీయ స్థాయిలో ప్రభావం చూపించిన వ్యక్తి.

అటువంటి వ్యక్తి అరెస్ట్ గురించి నిరసనలు తెలిపితే అందుకు అనుమతి ఇవ్వాలి కానీ అడ్డుకుంటే ఎలా? ఆంధ్ర ప్రాంతానికి చెందిన కమ్మ వారి ఓట్లు కావాలి కానీ వారికి నిరసనలు తెలిపే హక్కు లేదా?

చంద్రబాబు అరెస్ట్ తెలంగాణకు సంబంధం లేదు అనుకుంటే తెలంగాణ ఉద్యమం సమయంలో అమెరికాలో వైట్ హౌజ్ ముందు ఎందుకు నిరసనలు తెలిపారు?..

నిరసన తెలిపే వారిని అడ్డుకుంటే వారు ఈసారి బీఆర్ఎస్ పార్టీ చెంపలు వాయిస్తారు. ఈసారి ఎన్నికల్లో ఆంధ్ర సెటిలర్స్ బీఆర్ఎస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెడతారు.