చంద్రబాబు అరెస్టులో ప్రస్తుతం న్యూస్ అప్డేట్..
కాసేపట్లో తీర్పు అనగా కీలక సమాచారం!!.
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సుదీర్ఘ వాదనల అనంతరం జడ్జిమెంట్ కాపీ టైపింగ్ అవుతోందని తెలుస్తోంది. జడ్జి తీర్పు వెల్లడించడానికి 20 నిమిషాలపైగా సమయం పడుతుందని సమాచారం. ఇదిలా ఉండగా స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు 409 సెక్షన్ వర్తించబోదని కోర్ట్ తెలిపినట్టు తెలుస్తోంది. అంతేకాదు సెక్షన్ 17Aని కూడా ఏసీబీ కోర్ట్ తిరస్కరించినట్టు సమాచారం. చివరికి చంద్రబాబుకి 41A నోటీసులు ఇచ్చి విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఉత్కంఠకు మరికొద్ది సేపట్లోనే తెలియనుంది.
బ్రేకింగ్ న్యూస్..
*విజయవాడ/ఈరోజు వార్తలు:-* విజయవాడ ఏసీబీ కోర్టు వద్ద రెండు కాన్వాయ్ లను సిద్ధం చేసిన పోలీసులు
– రెండు కాన్వాయ్ లు ఏర్పాటుపై టీడీపీ అధిష్టానం ఆరా
– ఒక కాన్వాయ్ చంద్రబాబు ఉపయోగించేది కాగా
.. మరోకటి పోలీసులు ఏర్పాటు చేసిన కాన్వాయ్.
6 గంటల్లోపు తీర్పు వెల్లడించునున్న న్యాయమూర్తి.
▪️టైపింగ్ ప్రక్రియ ప్రారంభం.
▪️జడ్జి హిమబిందు గారు ఇప్పుడే బెంచ్ మీదకు వచ్చారు.
▪️కొద్ది నిముషాల్లో ఆర్డర్!
తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే ఉరి తీయండి అంటూ చంద్రబాబు ఛాలెంజ్ విసిరారు. దర్యాప్తు అధికారి రాకుండా తనను ఎలా అరెస్ట్ చేస్తారంటూ చంద్రబాబు ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లో ఆధారాలు చూపాల్సిందేనని చంద్రబాబు అన్నారు. కేసు వివరాలు ఇవ్వాలని అధికారులను కోరిన చంద్రబాబు, ఇందుకు పోలీసులు బదులిస్తూ రిమాండ్ రిపోర్ట్‌లో వివరాలు ఉంటాయని తెలిపారు. ముందే రిమాండ్ రిపోర్ట్ ఇవ్వలేమని పోలీసులు తేల్చి చెప్పారు. ఏ చట్టం ప్రకారం తనను అరెస్ట్ చేశారని..