చంద్రబాబు రెండో రోజు విచారణ ప్రారంభించిన సిఐడి…!

*చంద్రబాబు రెండో రోజు విచారణ ప్రారంభించిన సిఐడి*

స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని రెండో రోజు సీఐడీ అధికారులు ఆదివారం ప్రశ్నిస్తున్నారు.

కోర్ట్ ఆదేశాల ప్రకారం విచారణకు ముందు చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్యాధికారుల సమక్షంలో వైద్య పరీక్షలు చేశారు.

సెంట్రల్ జైలు కాన్ఫరెన్స్ హాలులో చంద్రబాబును సీఐడీ అధికారులు విచారణ చేస్తున్నారు. చంద్రబాబు తరపున ఇద్దరు న్యాయవాదులు హాజరయ్యారు.

ఇక, చంద్రబాబు రెండో రోజు విచారణ నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైలు ఆవరణలో పోలీసుల ఆంక్షలు విధించారు. జైలు చుట్టుపక్కల పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు.

అయితే, సీఐడీ అధికారులు విచారిస్తున్న సమయంలో చంద్రబాబు పక్కనే ఆయన తరపు న్యాయవాదులు లక్ష్మీనారాయణ, శ్రీనివాస్ ఉన్నారు. విచారణ సమయంలో చంద్రబాబుకు 10 మీటర్ల దూరంలో అడ్వకేట్లు ఉండనున్నారు. ఈ స్కిల్ స్కాం కేసులో మొత్తం రూ.371 కోట్ల కుంభకోణం జరిగిందనీ సీఐడీ అధికారులు ఆరోపిస్తున్నారు.

నిన్న చంద్రబాబు చెప్పిన ఆన్సర్స్ ను బట్టి.. సీఐడీ అధికారులు కొత్త ప్రశ్నావళిని రెడీ చేసుకున్నట్లు తెలుస్తుంది……